ఏపి ప్రభుత్వంపై ఎన్జీటీ ఆగ్రహం
విధాత: రాయలసీమ ఎత్తిపోతలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్జీటీ ఆదేశాలకు విరుద్ధంగా పనులు చేపడితే జైలుకు పంపుతామంటూ సీఎస్‌ను హెచ్చరించింది. పర్యావరణ అనుమతులు లేకుండా పనులు జరపొద్దని గతంలో ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. ఎన్జీటీ ఆదేశాలు ఉల్లంఘిస్తూ పనులు చేస్తున్నారని తెలంగాణ వాసి గవినోళ్ల శ్రీనివాస్ ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో విచారణ చేపట్టిన ఎన్జీటీ చెన్నై ధర్మాసనం.. ఎత్తిపోతల తాజా పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని కృష్ణానదీ యాజమాన్య […]

విధాత: రాయలసీమ ఎత్తిపోతలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్జీటీ ఆదేశాలకు విరుద్ధంగా పనులు చేపడితే జైలుకు పంపుతామంటూ సీఎస్‌ను హెచ్చరించింది. పర్యావరణ అనుమతులు లేకుండా పనులు జరపొద్దని గతంలో ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. ఎన్జీటీ ఆదేశాలు ఉల్లంఘిస్తూ పనులు చేస్తున్నారని తెలంగాణ వాసి గవినోళ్ల శ్రీనివాస్ ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో విచారణ చేపట్టిన ఎన్జీటీ చెన్నై ధర్మాసనం.. ఎత్తిపోతల తాజా పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డును ఆదేశించింది. తదుపరి విచారణను జులై 12కు వాయిదా వేసింది.