అన‌కాప‌ల్లి దుర్ఘ‌ట‌న‌పై ఎన్ హెచ్ ఏ విచార‌ణ‌

విధాత,విశాఖపట్నం: జాతీయ రహదారుల విస్తరణ, అనుసంధాన ప్రక్రియలో భాగంగా విశాఖ జిల్లా అనకాపల్లి సమీపంలో చేపడుతున్న ఫ్లైఓవర్‌ బీమ్‌లు జారిపడడంతో మంగళవారం ఇద్దరు దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. మరో ముగ్గురు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. అనకాపల్లి ఫ్లైఓవర్‌ దుర్ఘటనపై నేషనల్ హైవే అథారిటీ విచారణ చేపట్టింది. ఫ్లైఓవర్‌ నిర్మాణం కోసం 15 బీముల అమరిక, 2 బీములు జారిపడటంతో ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గల కారణాలపై ఎన్‌హెచ్‌ఏఐ […]

అన‌కాప‌ల్లి దుర్ఘ‌ట‌న‌పై ఎన్ హెచ్ ఏ విచార‌ణ‌

విధాత,విశాఖపట్నం: జాతీయ రహదారుల విస్తరణ, అనుసంధాన ప్రక్రియలో భాగంగా విశాఖ జిల్లా అనకాపల్లి సమీపంలో చేపడుతున్న ఫ్లైఓవర్‌ బీమ్‌లు జారిపడడంతో మంగళవారం ఇద్దరు దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. మరో ముగ్గురు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. అనకాపల్లి ఫ్లైఓవర్‌ దుర్ఘటనపై నేషనల్ హైవే అథారిటీ విచారణ చేపట్టింది. ఫ్లైఓవర్‌ నిర్మాణం కోసం 15 బీముల అమరిక, 2 బీములు జారిపడటంతో ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గల కారణాలపై ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు విచారణ జరుపుతున్నారు. మృతులు సతీష్‌కుమార్‌, సుశాంత్‌ మహంతిల మృతదేహాలను వారి కుటుంబానికి అప్పగించారు. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు చెప్పిన వివరాల మేరకు అనకాపల్లి నుంచి విశాఖకు వెళ్లే మార్గంలో జలగలమదుం జంక్షన్‌ వద్ద ఫ్లై ఓవర్‌ పైభాగంలో అమర్చిన బీమ్‌లు ఒక్కసారిగా జారి అదే సమయంలో విశాఖ వైపు వెళ్తున్న ఒక కారు, ఆయిల్‌ ట్యాంకర్‌పై పడ్డాయి.