ఉద్యోగులకు ఎలాంటి అన్యాయం జరగదు: సజ్జల

చట్టప్రకారమే సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ పరీక్షఉద్యోగాలు ఎక్కడికీ పోవు.. పరీక్ష పాస్ కాకుంటే ప్రొబేషన్‌లోనే..వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డివిధాత,అమరావతి:సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ కోసం పరీక్ష చట్ట ప్రకారమే నిర్వహిస్తున్నామని..అందరు ఉద్యోగులకు ఇలాంటి రూల్‌ ఉందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఉద్యోగాలు ఎక్కడికీ పోవని.. పరీక్ష పాస్ కాకుంటే ప్రొబేషన్‌లోనే ఉంటారని ఆయన వివరణ ఇచ్చారు. డిపార్ట్‌మెంట్ టెస్టులు ఏటా ఏపీపీఎస్సీ రెండుసార్లు నిర్వహిస్తుందని.. […]

ఉద్యోగులకు ఎలాంటి అన్యాయం జరగదు: సజ్జల

చట్టప్రకారమే సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ పరీక్ష
ఉద్యోగాలు ఎక్కడికీ పోవు.. పరీక్ష పాస్ కాకుంటే ప్రొబేషన్‌లోనే..
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

విధాత,అమరావతి:సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ కోసం పరీక్ష చట్ట ప్రకారమే నిర్వహిస్తున్నామని..అందరు ఉద్యోగులకు ఇలాంటి రూల్‌ ఉందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఉద్యోగాలు ఎక్కడికీ పోవని.. పరీక్ష పాస్ కాకుంటే ప్రొబేషన్‌లోనే ఉంటారని ఆయన వివరణ ఇచ్చారు. డిపార్ట్‌మెంట్ టెస్టులు ఏటా ఏపీపీఎస్సీ రెండుసార్లు నిర్వహిస్తుందని.. ఈ విధానంలో ఉద్యోగులకు ఎలాంటి అన్యాయం జరగదన్నారు. జాబ్ క్యాలెండర్‌పై టీడీపీ వాళ్లకి మాట్లాడే అర్హత లేదని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.