Vande Bharat Express | ఈ నెల 6 నుంచి కాచిగూడ – యశ్వంత్‌పూర్ వందే భారత్ పరుగులు..! వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ
Vande Bharat Express | తెలుగు రాష్ట్రాలకు మరో వందే భారత్ రైలు అందుబాటులోకి వస్తున్నది. కొత్తగా కాచిగూడ - యశ్వంత్‌పూర్ మధ్య రైలు నడువనున్నది. నంద్యాల జిల్లా డోన్ మీదుగా కర్ణాటకలోని యశ్వంత్‌పూర్ వరకు రైలు నడువనున్నది. ఆగస్టు 6న రైలును ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే అధికారులు విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించారు. ఇందులో భాగంగా సోమవారం […]

Vande Bharat Express | తెలుగు రాష్ట్రాలకు మరో వందే భారత్ రైలు అందుబాటులోకి వస్తున్నది. కొత్తగా కాచిగూడ – యశ్వంత్‌పూర్ మధ్య రైలు నడువనున్నది. నంద్యాల జిల్లా డోన్ మీదుగా కర్ణాటకలోని యశ్వంత్‌పూర్ వరకు రైలు నడువనున్నది. ఆగస్టు 6న రైలును ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే అధికారులు విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం 6.30 గంటలకు డోన్‌లో బయలుదేరిన రైలు 10.30 గంటలకు కాచిగూడకు చేరుకున్నది. ప్రస్తుతం రైలు కాచిగూడ స్టేషన్లో నిలిపి ఉంచారు.
ప్రధాని నరేంద్ర మోదీ వందే భారత్ రైలుకు ప్రారంభోత్సవం చేయడంతో పాటు అమృత్ భారత్ స్టేషన్లుగా ఎంపిక చేసిన మల్కాజ్గిరి, మలక్‌పేట, ఉప్పుగూడ, నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, కర్నూల్ స్టేషన్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. ఇప్పటికే తెలుగు విశాఖపట్నం – సికింద్రాబాద్ – విశాఖపట్నం, సికింద్రాబాద్ – తిరుపతి – సికింద్రాబాద్ మధ్య వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఆయా రైళ్లకు మంచి ఆదరణ లభిస్తున్నది.
ఈ క్రమంలో రెండు ఐటీ నగరాలైన బెంగళూరు, హైదరాబాద్ మధ్య వందే భారత్ రైలును ప్రారంభించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా కాచిగూడ- యశ్వంతపూర్ రైలును ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం బెంగళూరుకు 12 గంటల వరకు సమయం పడుతుండగా.. వందే భారత్‌లో ఏడుగంటల్లోనే గమ్యస్థానానికి చేరుకునే వీలుకలుగనున్నది. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడులో చెన్నై – తిరునల్వేలి మధ్య వందే భారత్ రైలుకు సైతం ప్రారంభోత్సవం చేయనున్నారు. ఎనిమిది కోచ్‌లు ఉన్న ఈ వందే భారత్ రైలు తిరుచ్చి, మధురై నగరాల్లో మాత్రమే ఆగనున్నది.