కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కోరుతూ విజయవాడ లెనిన్ సెంటర్ లో బైక్ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

జాబ్ క్యాలెండర్ పై బైక్ ర్యాలీలు నిర్వహిస్తే అక్రమ అరెస్టులా - డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఎం.సూర్యారావు విధాత:స్థానిక విజయవాడ లెనిన్ సెంటర్ లో బైక్ ర్యాలీలు నిర్వహిస్తే, ర్యాలీలు జరగకుండా అక్రమ అరెస్టులు చేసి పోలీసులు నిర్భంధించి, గవర్నర్ పేట పోలీసు స్టేషన్ కు తరలించారు. ఈకార్యక్రమంలో డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ నూతన జాబ్ క్యాలండర్ కోసం గత నెల 18 నుండీ ఆందోళన వ్యక్తం చేసిన ప్రభుత్వం స్పందించలేదు. సజ్జల రామకృష్ణరెడ్డి, డిజిపితో […]

కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కోరుతూ విజయవాడ లెనిన్ సెంటర్ లో బైక్ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

జాబ్ క్యాలెండర్ పై బైక్ ర్యాలీలు నిర్వహిస్తే అక్రమ అరెస్టులా – డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఎం.సూర్యారావు

విధాత:స్థానిక విజయవాడ లెనిన్ సెంటర్ లో బైక్ ర్యాలీలు నిర్వహిస్తే, ర్యాలీలు జరగకుండా అక్రమ అరెస్టులు చేసి పోలీసులు నిర్భంధించి, గవర్నర్ పేట పోలీసు స్టేషన్ కు తరలించారు. ఈకార్యక్రమంలో డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ నూతన జాబ్ క్యాలండర్ కోసం గత నెల 18 నుండీ ఆందోళన వ్యక్తం చేసిన ప్రభుత్వం స్పందించలేదు. సజ్జల రామకృష్ణరెడ్డి, డిజిపితో సమాధానము చెప్పేస్తారు తప్ప ముఖ్యమంత్రి, మంత్రులు మాట్లాడక పోవడం దారుణం, ఎఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.సుబ్బారావు మాట్లాడుతూ ప్రజాస్వామ్య యుతంగా నిరసన తెలియజేస్తే అన్నిచోట్ల అక్రమంగా అరెస్టులు చేసి నిర్భందాంచడం ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనం,పిడిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు రామకృష్ణ మాట్లాడుతూ నిర్భందాలతో ఉద్యమాలను ఆపలేరన్నారు. నూతన జాబ్ క్యాలండర్ ప్రకటించే వరకు పోరాడతామన్నారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.సోమేశ్వరరావు మాట్లాడుతూ నిరుద్యోగ సమస్యలుపై ఐక్యంగా పోరాడతామన్నారు.

అరెస్ట్ ఆయన వారిలో ఎఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి శివారెడ్డి, ఉపాధ్యక్షులు జాన్సన్ బాబు, డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు వై. రాము, డివైఎఫ్ఐ కృష్ణజిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎన్. నాగేశ్వరరావు, పి.కృష్ణ, నాయకులు నిజాం, పీరు, ఎస్ఎఫ్ఐ కృష్ణాజిల్లా అద్యక్షు కోటిబాబు నాయకులు, ఏసుబాబు, రాధకృష్ణ, ఎఐఎస్ఎఫ్ సాయి, అరుణ్కుమార్ తదితరులు మొత్తం 16మంది అరెస్టులు జరిగాయి. అరెస్ట్ చేసి గవర్నర్ పేట పోలీసు స్టేషన్ కి తరలించారు.