చిత్తూరు నగరంలో వస్త్రాలు చోరీ చేస్తూ దొరికిన ఓ పోలీసు అధికారి మృతి

ఉన్నతాధికారులు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేయడంతో మనస్తాపానికి గురై మరణించినట్లు తెలిపిన పోలీసులు విధాత‌: చిత్తూరు నగరంలో ఓ వ్యాపారి వ్యానులో పెట్టిన దుస్తులను చోరీ చేస్తూ ఇటీవల దొరికిపోయిన.. ఏఆర్ ఎస్సై మహమ్మద్ మృతి చెందాడు. నాలుగు రోజుల కిందట కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఒక కానిస్టేబుల్​తో కలిసి దుస్తులు దొంగతనం చేసిన ఘటనలో.. సీసీ పుటేజీ ఆధారంగా మహమ్మద్​ను పోలీసు శాఖ ఉన్నతాధికారులు విధులు నుంచి తాత్కాలికంగా తొలగించారు. అనంతరం ఆయనను అరెస్టు చేసి […]

చిత్తూరు నగరంలో వస్త్రాలు చోరీ చేస్తూ దొరికిన ఓ పోలీసు అధికారి మృతి
  • ఉన్నతాధికారులు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేయడంతో మనస్తాపానికి గురై మరణించినట్లు తెలిపిన పోలీసులు

విధాత‌: చిత్తూరు నగరంలో ఓ వ్యాపారి వ్యానులో పెట్టిన దుస్తులను చోరీ చేస్తూ ఇటీవల దొరికిపోయిన.. ఏఆర్ ఎస్సై మహమ్మద్ మృతి చెందాడు. నాలుగు రోజుల కిందట కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఒక కానిస్టేబుల్​తో కలిసి దుస్తులు దొంగతనం చేసిన ఘటనలో.. సీసీ పుటేజీ ఆధారంగా మహమ్మద్​ను పోలీసు శాఖ ఉన్నతాధికారులు విధులు నుంచి తాత్కాలికంగా తొలగించారు.

అనంతరం ఆయనను అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. సస్పెన్షన్​కు సంబంధించిన ఉత్తర్వులు బుధవారం ఆయనకు అందడంతో.. తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. గురువారం ఉదయం మహమ్మద్ వాంతులు చేసుకోగా..జైలు అధికారులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న సదరు అధికారి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.