జాబ్ క్యాలెండర్‌ను వ్యతిరేకిస్తూ నిరసన
విజయనగరం : ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌ను వ్యతిరేకిస్తూ విజయనగరంలో యువత ఆందోళన బాట పట్టింది. విద్యార్థి సంఘాలు ఈ ఉదయం కలెక్టరేట్‌ను ముట్టడించాయి. తొలుత విద్యార్థులు కోట కూడలి వద్ద మానవహారం చేపట్టారు. ఇక్కడి నుంచి కలెక్టరేట్ వరకు విద్యార్థులు భారీ ర్యాలీగా చేరుకున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉద్యోగాల నోటిఫికేషన్‌లో తక్కువ సంఖ్యలో ఉద్యోగాలకు అవకాశం కల్పించారని విద్యార్థులు విమర్శించారు. ఇది నిరుద్యోగులకు ఏమాత్రం ప్రయోజనకరంగా లేదని అభ్యంతరం వ్యక్తం […]

విజయనగరం : ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌ను వ్యతిరేకిస్తూ విజయనగరంలో యువత ఆందోళన బాట పట్టింది. విద్యార్థి సంఘాలు ఈ ఉదయం కలెక్టరేట్‌ను ముట్టడించాయి. తొలుత విద్యార్థులు కోట కూడలి వద్ద మానవహారం చేపట్టారు. ఇక్కడి నుంచి కలెక్టరేట్ వరకు విద్యార్థులు భారీ ర్యాలీగా చేరుకున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉద్యోగాల నోటిఫికేషన్‌లో తక్కువ సంఖ్యలో ఉద్యోగాలకు అవకాశం కల్పించారని విద్యార్థులు విమర్శించారు. ఇది నిరుద్యోగులకు ఏమాత్రం ప్రయోజనకరంగా లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ శాఖాల్లోని ఖాళీలతో నోటిఫికేషన్ ఇవ్వాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు.