స్టాంప్ డ్యూటీ తగ్గించండి
విధాత,విజయవాడ : రాష్ట్రంలోని స్థలాల, ఇళ్ల రిజిస్ట్రేషన్ల స్టాంపు డ్యూటీని 7.5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించాలని క్రెడాయ్ ప్రతినిధులు కోరారు. విజయవాడ భారతీనగర్‌లో రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ను కలిసి దీనిపై విన్నవించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైన నేపథ్యంలో 2009లో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం 2 శాతానికి తగ్గించారని, రెండేళ్ల పాటు ఈ ఉత్తర్వులు కొనసాగాయని గుర్తుచేశారు. ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు స్టాంప్ డ్యూటీ తగ్గించాయని తెలిపారు. మార్కెట్ […]

విధాత,విజయవాడ : రాష్ట్రంలోని స్థలాల, ఇళ్ల రిజిస్ట్రేషన్ల స్టాంపు డ్యూటీని 7.5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించాలని క్రెడాయ్ ప్రతినిధులు కోరారు. విజయవాడ భారతీనగర్‌లో రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ను కలిసి దీనిపై విన్నవించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైన నేపథ్యంలో 2009లో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం 2 శాతానికి తగ్గించారని, రెండేళ్ల పాటు ఈ ఉత్తర్వులు కొనసాగాయని గుర్తుచేశారు. ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు స్టాంప్ డ్యూటీ తగ్గించాయని తెలిపారు. మార్కెట్ విలువలనూ ఏడాది వరకు పెంచవద్దని కోరారు. మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చిస్తామని మంత్రి తెలిపినట్లు క్రెడాయ్ ప్రతినిధులు ఆర్.వి.స్వామి, రమణారావు, రాంబాబు, మోహనరావు పేర్కొన్నారు.
మార్కెట్ విలువల పెంపు నిలుపుదల చేయాలి
కరోనా నేపథ్యంలో భవన నిర్మాణ రంగం.. ఎన్నో సమస్యలతో సతమతమవుతుందని ఈ పరిస్థితుల్లో భూములు, స్థలాలపై మార్కెట్ విలువల పెంపుదలను వాయిదా వేసి, యథావిధిగా కొనసాగించాలని క్రెడాయ్(విజయవాడ చాప్టర్) ప్రధాన కార్యదర్శి కె.రమేష్, జాయింట్ సెక్రటరీ టి.వంశీకృష్ణ పేర్కొన్నారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల డీఐజీ ఎ.రవీంద్రనాథ్‌ను పటమట పంటకాల్వ రోడ్డులోని కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు.