సచివాలయ ఉద్యోగుల పరీక్ష నోటిఫికేష‌న్ విడుద‌ల‌

విధాత‌: గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగుల పరీక్షలపై ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఈ నెల 28 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు డిపార్ట్‌మెంట్‌ పరీక్షల నిర్వహణకు ఏపీపీఎస్‌సీ సిద్ధమైంది. ఏపీపీఎస్‌సీ వెబ్‌సైట్‌లో ఓటీపీ ద్వారా రిజిస్ట్రేషన్‌ సదుపాయం కల్పించింది. ఓటీపీఆర్‌లో వచ్చే యూజర్‌ ఐడీతో ఈ నెల 13 నుంచి 17 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు ఏపీపీఎస్‌సీ అవకాశం ఇచ్చింది. కాగా, పరీక్షల్లో వంద […]

సచివాలయ ఉద్యోగుల పరీక్ష నోటిఫికేష‌న్ విడుద‌ల‌

విధాత‌: గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగుల పరీక్షలపై ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఈ నెల 28 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు డిపార్ట్‌మెంట్‌ పరీక్షల నిర్వహణకు ఏపీపీఎస్‌సీ సిద్ధమైంది. ఏపీపీఎస్‌సీ వెబ్‌సైట్‌లో ఓటీపీ ద్వారా రిజిస్ట్రేషన్‌ సదుపాయం కల్పించింది. ఓటీపీఆర్‌లో వచ్చే యూజర్‌ ఐడీతో ఈ నెల 13 నుంచి 17 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు ఏపీపీఎస్‌సీ అవకాశం ఇచ్చింది. కాగా, పరీక్షల్లో వంద మార్కులకు గాను 40 మార్కులు వస్తేనే ప్రొబేషనరీకి ఉద్యోగులు అర్హులని ఏపీపీఎస్‌సీ వెల్లడించింది.