సోము వీర్రాజు ఢిల్లీ పర్యటన
ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు,మూడు రోజుల ఢిల్లీ' పర్యటనకు బయలుదేరి వెళ్లారు. నేటి ఉదయం విజయవాడ విమానాశ్రయం నుంచి ఎయిరిండియా విమానంలో బయలుదేరి వెళ్లారు సోము వీర్రాజు వెంట వెళ్ళిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ రాజు బిజెపి అధ్యక్షులు జె.పి.నడ్డా'తో భేటీ కానున్న సోము వీర్రాజువిధాత:ఇటీవల కాలంలో రాష్ట్రంలో జరిగిన పార్టీ కార్యక్రమాలు,చేపట్టిన ఉద్యమాలు, పార్టీ బలోపేతానికి తీసుకుంటున్న చర్యలపై నివేదించనున్నారు.కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్'ను కలసి, ఏపీ ప్రభుత్వంలో నెలకొన్న […]

- ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు,మూడు రోజుల ఢిల్లీ’ పర్యటనకు బయలుదేరి వెళ్లారు.
- నేటి ఉదయం విజయవాడ విమానాశ్రయం నుంచి ఎయిరిండియా విమానంలో బయలుదేరి వెళ్లారు
- సోము వీర్రాజు వెంట వెళ్ళిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ రాజు
- బిజెపి అధ్యక్షులు జె.పి.నడ్డా’తో భేటీ కానున్న సోము వీర్రాజు
విధాత:ఇటీవల కాలంలో రాష్ట్రంలో జరిగిన పార్టీ కార్యక్రమాలు,చేపట్టిన ఉద్యమాలు, పార్టీ బలోపేతానికి తీసుకుంటున్న చర్యలపై నివేదించనున్నారు.కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్’ను కలసి, ఏపీ ప్రభుత్వంలో నెలకొన్న ఆర్ధిక గందరగోళం, కేంద్ర ప్రభుత్వం సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించిన నిధులు దారి మల్లింపు, విషయాలలో పిర్యాదు చేస్తారు.కేంద్ర జలశక్తి శాఖా మంత్రి గజేంద్ర షేకావత్’ తో భేటీ కానున్న సోము వీర్రాజు బృందం.పోలవరం ప్రాజెక్టు, R&R ప్యాకేజీ, ప్రాజెక్టు కు సంబంధించిన ముఖ్యమైన అంశాలు జలశక్తి మంత్రి దృష్టికి తీసుకువచ్చి, నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టును సందర్శించవలసినదిగా కోరనున్నారు.కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్’ను కలవనున్న సోము వీర్రాజు.రాష్ట్రంలో ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను, ఎగుమతులు అంశాలను మంత్రి దృష్టికి తీసుకురాను న్నారు.
రైల్వే శాఖా మంత్రి అశ్వనీ వైష్ణవి ని కలసి, ఏపీ’లో రైల్వే పెండింగ్ ప్రాజెక్టులు అంశాలు విశాఖ రైల్వే జోన్ అభివృద్ధికి తెసుకోవలసిన చర్యలను మంత్రి దృష్టికి తీసుకురానున్నారు
కేంద్ర రైల్వే శాఖ ఆమోదం పొంది, నిధులు కేటాయించినా, రాష్ట్రప్రభుత్వ వాటా చెల్లించని అంశాలతో పాటు,కొత్త రైల్వే లైను @ కొవ్వూరు – భద్రాచలం అంశంపై రైల్వే మంత్రి దృష్టికి తీసుకువచ్చి,సత్వరం చర్యల కోసం విజ్ఞప్తి చేయనున్నారు.ఏపీ అభివృద్దే లక్ష్యంగా మరికొందరు కేంద్ర మంత్రులు, పార్టీ పెద్దలను ఈ ఢిల్లీ’ పర్యటనలో ఏపీ బిజెపి చీఫ్ సోము వీర్రాజు కలవనున్నారు.గత నెల రోజుల్లో సోము వీర్రాజు ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ఇది రెండోసారి.