కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ తో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ భేటీ

విధాత :రాష్ట్రంలో భారత్ నెట్ పనులు వేగవంతం చేయడం మొదలైన అంశాల పై కేంద్ర న్యాయ, కమ్యూనికేషన్స్, ఎలెక్ట్రానిక్స్ మరియు ఐ టీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చర్చించారు. ఈ రోజు సాయంత్రం న్యూఢిల్లీలోని సీ జీ వో కాంప్లెక్స్ లో కేంద్ర మంత్రిని మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎస్ ఎస్ రావత్,ఏపీ భవన్ రెసిడెంట్ […]

కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ తో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ భేటీ

విధాత :రాష్ట్రంలో భారత్ నెట్ పనులు వేగవంతం చేయడం మొదలైన అంశాల పై కేంద్ర న్యాయ, కమ్యూనికేషన్స్, ఎలెక్ట్రానిక్స్ మరియు ఐ టీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చర్చించారు. ఈ రోజు సాయంత్రం న్యూఢిల్లీలోని సీ జీ వో కాంప్లెక్స్ లో కేంద్ర మంత్రిని మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎస్ ఎస్ రావత్,ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ భావ్నా సక్సేనా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సౌకర్యం అందించాల్సిన అవసరముందన్నారు. ఇంటర్నెట్ సౌకర్యాల కల్పనకు కేంద్రం చేపట్టిన భారత్ నెట్ పనులను రాష్ట్రంలో వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. కేంద్రం సూచించిన పిపిపి మోడల్ లో త్వరగతిన పనులు మొదలుపెట్టి, పూర్తి చేయాలని కోరామన్నారు.
రాష్ట్రంలో ఎస్సీలకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదాన్ని కోరడం జరిగిందన్నారు. ఇదివరకు రాష్ట్రంలో ఎస్సీ మరియు ఎస్టీలకు ఒకే కమిషన్ ఉండేదని తెలిపారు.
రాష్టంలో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయవలసిందిగా కోరడం జరిగిందన్నారు. మంత్రి వీటన్నిటికీ సానుకూలంగా స్పందించారని తెలియజేశారు.

ReadMore:సీఎం జగన్‌కు వ్యతిరేకంగా గత పదేళ్లుగా కుట్రలు: సజ్జల