థర్డ్ వేవ్‌ను సమర్థంగా ఎదుర్కోవాలి: జగన్
విధాత,అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్ థర్డ్ వేవ్ వచ్చినా సమర్థంగా ఎదుర్కొనేందుకు పూర్తి సన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లాలో తొలి డెల్టాప్లస్ కేసు నమోదైన దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలు, వాక్సినేషన్‌పై ముఖ్యమంత్రి వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులను అధికారులు సీఎంకు వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 50వేల దిగువకు చేరాయని తెలిపారు. పాజిటివిటీ రేటు 5.23 […]

విధాత,అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్ థర్డ్ వేవ్ వచ్చినా సమర్థంగా ఎదుర్కొనేందుకు పూర్తి సన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లాలో తొలి డెల్టాప్లస్ కేసు నమోదైన దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలు, వాక్సినేషన్‌పై ముఖ్యమంత్రి వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులను అధికారులు సీఎంకు వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 50వేల దిగువకు చేరాయని తెలిపారు. పాజిటివిటీ రేటు 5.23 శాతం ఉందన్నారు. రాష్ట్రంలో 3,148 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయన్నారు. వీరిలో 1,095 మందికి శస్త్ర చికిత్సలు చేయగా.. 237 మంది చనిపోయినట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 అంతకంటే ఎక్కువ పడకలున్న ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సెప్టెంబరు నాటికి 97 ప్లాంట్లు సిద్ధమవుతాయని.. మిగిలినవి వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేస్తామని అధికారులు వివరించారు.21 రోజుల్లో ఆరోగ్యశ్రీ చెల్లింపులు..ప్రభుత్వ, ఈఎస్ఐ ఆస్పత్రుల్లో వినియోగించే మందులన్నీ జీఎంపీ, డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలతో ఉండాలన్నారు. ఆస్పత్రుల్లో పరిశుభ్రత, రోగులకు అందించే ఆహారం, వారికి అందుతున్న సేవలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని చెప్పారు. ఆస్పత్రి భవనాలు, వైద్య పరికరాల నిర్వహణపైనా దృష్టి పెట్టాలన్నారు. వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది హాజరుపై పర్యవేక్షణ ఉండాలని.. ఇందుకోసం ప్రత్యేక అధికారిని నియమించాలని వెల్లడించారు. 21 రోజుల్లో కచ్చితంగా ఆరోగ్యశ్రీ, 104, 108 బిల్లులు చెల్లించాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు.
హెల్త్‌హబ్స్‌తో వైద్య రంగం బలోపేతం..
రాష్ట్రంలోని జిల్లాల్లో ఏర్పాటు చేయనున్న హెల్త్ హబ్స్‌పై సీఎం సమీక్షించారు. క్యాన్సర్, గుండె జబ్బులు, చిన్నపిల్లల సర్జరీల కోసం అధికంగా ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారన్నారు. ఈ వ్యాధులకు వైద్యసేవలు ఇక్కడి హెల్త్ హబ్స్‌లో అందించాలని.. అందుకు అనుగుణంగా మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటుకు హబ్స్‌లో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో కొత్తగా 16 మెడికల్ కళాశాలల ఏర్పాటు సహా, 11 పాత వైద్య కళాశాలలను ఆధునికీకరిస్తున్నట్లు సీఎం తెలిపారు. హెల్త్‌హబ్స్‌తో వైద్య రంగం బలోపేతం అవుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. ఈ హెల్త్‌హబ్స్ ఆవాసాలకు దగ్గరగానే ఉండేలా చూడాలని.. అప్పుడే పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారని అధికారులకు సీఎం సూచించారు.