ఎడారిగా మారబోతున్న ప్రకాశం జిల్లా..
విధాత: ఏపీ ప్రభుత్వ వైఖరి కారణంగా భవిషత్తులో ప్రకాశం జిల్లా మొత్తం ఎడారిగా మారబోతుంది.దీనిని నిరసిస్తూ మేము సిఎంకు లేఖ రాశాం అన్నారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు. ఓ వైపు తెలంగాణా ప్రభుత్వం అడ్డగోలుగా ప్రాజెక్టులు కడుతుంటే ఈ ప్రభుత్వం మౌనం వహిస్తోంది.దీని ద్వారా శ్రీశైలం ప్రాజెక్ట్ కు రావలసిన నీరు తగ్గిపోతోంది.వచ్చిన కొద్ది పాటి నీటిని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో 803అడుగుల ఎత్తు లో 80వేల క్యూసెక్కుల నీరు తీసుకెళ్తుంటే పశ్చిమ […]

విధాత: ఏపీ ప్రభుత్వ వైఖరి కారణంగా భవిషత్తులో ప్రకాశం జిల్లా మొత్తం ఎడారిగా మారబోతుంది.దీనిని నిరసిస్తూ మేము సిఎంకు లేఖ రాశాం అన్నారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు.
ఓ వైపు తెలంగాణా ప్రభుత్వం అడ్డగోలుగా ప్రాజెక్టులు కడుతుంటే ఈ ప్రభుత్వం మౌనం వహిస్తోంది.దీని ద్వారా శ్రీశైలం ప్రాజెక్ట్ కు రావలసిన నీరు తగ్గిపోతోంది.వచ్చిన కొద్ది పాటి నీటిని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో 803అడుగుల ఎత్తు లో 80వేల క్యూసెక్కుల నీరు తీసుకెళ్తుంటే పశ్చిమ ప్రాంత ప్రజల ఆశాజ్యోతి వెలుగొండ ప్రాజెక్ట్ పరిస్థితి ఏంకావాలి..నాగార్జున సాగర్ ఆయకట్టుపై ప్రకాశం జిల్లాలో సాగవుతున్న 4లక్షల ఎకరాలు, గుంటూరు జిల్లా పరిధిలోని 8లక్షల ఎకరాలు.. ఎన్ఎస్పి కెనాల్ క్రింద 12 లక్షలమందికి తాగునీరు పరిస్థితి ఎంటి?.వీటన్నిటిని మీరు ఆలోచించరా…
అక్కడ చేపట్టిన ప్రాజెక్ట్ అక్కడి ప్రజలకు కూడా ఉపయోగపడకుండా వెచ్చించిన నిధులు బూడిదలో పోసిన పన్నీరులా పరిస్థితి మారబోతోంది.మీ అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజల మధ్య ప్రాంతాల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని వైసీపీ ప్రభుత్వం చూస్తోంది.దీనివల్ల భవిష్యత్తులో ఆంధ్ర తీవ్రంగా నష్టపోవడంతో పాటు ప్రకాశం జిల్లా గాడాంధకారంలోకి వెల్లబోతోంది.దీనిని ఇప్పటికైనా ముఖ్యమంత్రి సరిదిద్దుకోవాలి.తెలంగాణా ప్రభుత్వంతో సిఎం జగన్ కు పెనవేసుకున్న బంధం ఉంది.కనుక దీనిని రాజకీయం చేయకుండా అఫెక్స్ కౌన్సిల్ ను సమావేశ పరచి అక్కడ అక్రమంగా కడుతున్న ప్రాజెక్టులను కచ్చితంగా అడ్డుకోవాల్సిన భాద్యత వైసీపీ పై ఉంది.దీనిపై నాలుగు సెటైర్లు వేసి తప్పించుకుంటానంటే ఈ తెలుగు జాతి మిమ్మల్ని క్షమించదు.వైసీపీని అభిమానించి గెలిపించిన పశ్చిమ ప్రాంత ప్రజల నోట్లో వైసీపీ మన్నుకొడుతోంది.అసలే దుర్భిక్షంగా మారిన ప్రాంతాన్ని ఇంకా దుర్భిక్షంగా మారుస్తారా…?దీనిపై వైసీపీ స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను.