ఏపీలో టెన్త్ ఫలితాలు మరోవారం ఆలస్యం

విధాత‌: రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష ఫలితాలు మరో వారం రోజులు ఆలస్యం కానున్నాయి. విద్యార్థులకు నిర్వహించిన స్లిప్ టెస్ట్లు, ఎస్ఏ పరీక్షలకు వెయిటేజీ ఇచ్చి.. వాటి ఆధారంగా తుది మార్కులు ఇవ్వాలని ఛాయారతన్ కమిటీ చేసిన సిఫారసులను ప్రభుత్వం ఆమోదించింది. మార్కులను క్రోడీకరించి వాటిని పాఠశాల విద్య డైరెక్టరేట్ నుంచి ప్రభుత్వ పరీక్షల విభాగానికి పంపించాలి. అయితే ఇంతవరకూ స్లిప్ టెస్టులు, ఎస్ఏ పరీక్షల మార్కులను పాఠశాల విద్యాశాఖ సిద్ధం చేయలేదు. దీనికి ఇంకో నాలుగు […]

ఏపీలో టెన్త్ ఫలితాలు మరోవారం ఆలస్యం

విధాత‌: రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష ఫలితాలు మరో వారం రోజులు ఆలస్యం కానున్నాయి. విద్యార్థులకు నిర్వహించిన స్లిప్ టెస్ట్లు, ఎస్ఏ పరీక్షలకు వెయిటేజీ ఇచ్చి.. వాటి ఆధారంగా తుది మార్కులు ఇవ్వాలని ఛాయారతన్ కమిటీ చేసిన సిఫారసులను ప్రభుత్వం ఆమోదించింది. మార్కులను క్రోడీకరించి వాటిని పాఠశాల విద్య డైరెక్టరేట్ నుంచి ప్రభుత్వ పరీక్షల విభాగానికి పంపించాలి. అయితే ఇంతవరకూ స్లిప్ టెస్టులు, ఎస్ఏ పరీక్షల మార్కులను పాఠశాల విద్యాశాఖ సిద్ధం చేయలేదు. దీనికి ఇంకో నాలుగు రోజులు పడుతుందని సమాచారం. అనంతరం ఆ మార్కులు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ వద్దకు చేరతాయి. వాటిని పరిశీలించి తుది ఫలితాలను ప్రకటించేందుకు మరో మూడు రోజులు పడుతుందని చెబుతు న్నారు. దీనిబట్టి పదో తరగతి పరీక్షల ఫలితాలు మరో వారం తర్వాతే ప్రకటి స్తారని తెలుస్తోంది.