మహా పాదయాత్ర (న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు) ప్రారంభం
విధాత: తుళ్లూరు వేదికగా సోమవారం మహా పాదయాత్ర ప్రారంభమైంది. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో తిరుమల వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు, మహిళలు భారీగా ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. కాగా తుళ్లూరు నుంచి తిరుమల వరకు రోజుకు 14కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగనుంది. ఈ క్రమంలో గుంటూరు జిల్లాలో పాదయాత్ర 6రోజుల పాటు కొనసాగనుంది. నేడు ఈ పాదయాత్ర పరిమి మీదుగా తాడికొండకు చేరుకోనుంది.

విధాత: తుళ్లూరు వేదికగా సోమవారం మహా పాదయాత్ర ప్రారంభమైంది. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో తిరుమల వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు, మహిళలు భారీగా ఈ పాదయాత్రలో పాల్గొన్నారు.
కాగా తుళ్లూరు నుంచి తిరుమల వరకు రోజుకు 14కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగనుంది. ఈ క్రమంలో గుంటూరు జిల్లాలో పాదయాత్ర 6రోజుల పాటు కొనసాగనుంది. నేడు ఈ పాదయాత్ర పరిమి మీదుగా తాడికొండకు చేరుకోనుంది.