దొంగ విఫ‌ల‌య‌త్నం..!

విధాత‌: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరంలోని సత్రంపాడు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల ఇంట్లో మరోమారు దొంగతనానికి యత్నం జరిగింది. ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ సిద్ధార్థ వైద్యులుగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలోకిటికీ గ్రిల్స్ తొలగించడంలో విఫలమైన దొంగ‌ ఎలా వచ్చాడో తిరిగి అలాగే బయటికి వెళ్లి పోయాడు.ఇది తెలియని ఆయన కుటుంబ సభ్యులు యధావిధిగా ఉదయం లేచి చూసే సరికి కిటికీ గ్రిల్స్ తొలగించే యత్నం […]

దొంగ విఫ‌ల‌య‌త్నం..!

విధాత‌: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరంలోని సత్రంపాడు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల ఇంట్లో మరోమారు దొంగతనానికి యత్నం జరిగింది. ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ సిద్ధార్థ వైద్యులుగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలోకిటికీ గ్రిల్స్ తొలగించడంలో విఫలమైన దొంగ‌ ఎలా వచ్చాడో తిరిగి అలాగే బయటికి వెళ్లి పోయాడు.
ఇది తెలియని ఆయన కుటుంబ సభ్యులు యధావిధిగా ఉదయం లేచి చూసే సరికి కిటికీ గ్రిల్స్ తొలగించే యత్నం జరిగిందనీ గుర్తించారు. సీసీ కెమెరాలను పరీక్షించగా దొంగతనానికి విఫలయత్నం జరిగినట్లు డాక్టర్ సిద్ధార్థ గుర్తించారు ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చారు..ఈ వైద్యునీ ఇంట్లో 2018 సంవత్సరంలో ఒకసారి దొంగతనం జరిగింది మరల మరోమారు యత్నం విఫలమైంది.

https://www.facebook.com/100066192125075/videos/1050553592375891/