ఢిల్లీ స్థానిక స‌ల‌హామండ‌లి అధ్య‌క్షురాలిగా వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డి

విధాత‌: టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యురాలు వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డిని ఢిల్లీ స్థానిక స‌ల‌హామండ‌లి అధ్య‌క్షురాలిగా టిటిడి నియ‌మించింది. ఢిల్లీ ఆలయాన్ని అభివృద్ధిప‌రిచేందుకు, భక్తులకు విశేష సేవలందించేందుకు, ఉత్తర భారతదేశంలో టిటిడి ఆలయాల నిర్వహణ వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్ర‌శాంతిరెడ్డికి పర్యవేక్ష‌ణ బాధ్య‌త‌లు అప్ప‌గించింది. ఉత్తర భారతదేశంలోని టిటిడి ఆలయాల పర్యవేక్షణ బాధ్యతను పూర్తిస్థాయిలో చేపట్టడానికి టిటిడి బోర్డు చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి కోరగా ప్రశాంతిరెడ్డి తక్షణమే అంగీకరించారు. ఛైర్మన్ సూచనల మేర‌కు బోర్డు సభ్య‌త్వానికి వారు రాజీనామా సమర్పించారు. […]

ఢిల్లీ స్థానిక స‌ల‌హామండ‌లి అధ్య‌క్షురాలిగా వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డి

విధాత‌: టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యురాలు వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డిని ఢిల్లీ స్థానిక స‌ల‌హామండ‌లి అధ్య‌క్షురాలిగా టిటిడి నియ‌మించింది. ఢిల్లీ ఆలయాన్ని అభివృద్ధిప‌రిచేందుకు, భక్తులకు విశేష సేవలందించేందుకు, ఉత్తర భారతదేశంలో టిటిడి ఆలయాల నిర్వహణ వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్ర‌శాంతిరెడ్డికి పర్యవేక్ష‌ణ బాధ్య‌త‌లు అప్ప‌గించింది. ఉత్తర భారతదేశంలోని టిటిడి ఆలయాల పర్యవేక్షణ బాధ్యతను పూర్తిస్థాయిలో చేపట్టడానికి టిటిడి బోర్డు చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి కోరగా ప్రశాంతిరెడ్డి తక్షణమే అంగీకరించారు. ఛైర్మన్ సూచనల మేర‌కు బోర్డు సభ్య‌త్వానికి వారు రాజీనామా సమర్పించారు. భారతీయ సనాతన ధర్మ పరిరక్షణ, ప్రచారం కోసం, శ్రీ వేంకటేశ్వర స్వామివారి వైభవాన్ని న‌లుదిశ‌లా వ్యాప్తి చేయాలనే సదుద్దేశంతో దేశ రాజధాని ఢిల్లీ, ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కురుక్షేత్రలో శ్రీవారి ఆలయాల‌ను టిటిడి నిర్మించింది. జమ్మూ, వారణాసి న‌గ‌రాల్లో దేవాలయాల నిర్మాణం కొనసాగుతోంది. గత బోర్డులో రెండు సంవత్సరాలు పనిచేసి ప్రస్తుత బోర్డులో సభ్యురాలిగా కొన‌సాగుతున్న శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి స్వామివారిపై అపారమైన భక్తిశ్రద్ధ‌ల‌తో ఉత్త‌ర భార‌త‌దేశంలో ఆల‌యాల ప‌ర్య‌వేక్ష‌ణ బాధ్య‌త‌ల‌ను స్వీక‌రించారు.