శ్రీనివాసుడి కృపతో జల వివాదం పరిష్కారం కావాలి
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య జల వివాదం బాధాకరం రాష్ట్రానికి రావాల్సిన జలాలను గౌరవప్రదంగా సంపాదించుకోవాలి వివాదాలు పడడం వల్ల నష్టాలు ఎక్కువ విధాత:తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య జల వివాదం తారస్థాయికి చేరుతోన్న విషయం తెలిసిందే. ఏపీ నిర్మిస్తోన్న రాయలసీమ ఎత్తిపోతలను ఆపాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తుండడం, పులిచింతల వద్ద విద్యుదుత్పత్తి నిలిపేయాలని ఆంధ్రప్రదేశ్ డిమాండ్ చేస్తుండంతో దీనిపై ఏపీ మంత్రి అప్పలరాజు స్పందించారు. ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన […]

- తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య జల వివాదం బాధాకరం
- రాష్ట్రానికి రావాల్సిన జలాలను గౌరవప్రదంగా సంపాదించుకోవాలి
- వివాదాలు పడడం వల్ల నష్టాలు ఎక్కువ
విధాత:తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య జల వివాదం తారస్థాయికి చేరుతోన్న విషయం తెలిసిందే. ఏపీ నిర్మిస్తోన్న రాయలసీమ ఎత్తిపోతలను ఆపాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తుండడం, పులిచింతల వద్ద విద్యుదుత్పత్తి నిలిపేయాలని ఆంధ్రప్రదేశ్ డిమాండ్ చేస్తుండంతో దీనిపై ఏపీ మంత్రి అప్పలరాజు స్పందించారు. ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… జల వివాదం రావడం బాధాకరమని, ఆ శ్రీనివాసుడి కృపతో ఈ వివాదం పరిష్కారం కావాలని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి రావాల్సిన జలాలను గౌరవప్రదంగా సంపాదించుకోవాలని చెప్పారు. వివాదాలు పడడం వల్ల నష్టాలు ఎక్కువ ఉంటాయని అభిప్రాయపడ్డారు.