రాబోయే మూడు రోజుల్లో రాయలసీమ,కోస్తాలో తేలికపాటి వర్షాలు
విధాత: నైరుతి బంగాళాఖాతం, దాని దగ్గరగా ఉండే తమిళనాడు, శ్రీలంక తీర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది. రాబోయే మూడు రోజుల్లో ఇది పశ్చిమ దిశగా ప్రయాణించే అవకాశం ఉంది.దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, తూర్పు గాలులతో ఏర్పడిన ఉపరితల ద్రోణి కొనసాగుతున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా వెల్లడించారు.వీటి ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా ఉరుములు మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు, ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని […]

విధాత: నైరుతి బంగాళాఖాతం, దాని దగ్గరగా ఉండే తమిళనాడు, శ్రీలంక తీర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది. రాబోయే మూడు రోజుల్లో ఇది పశ్చిమ దిశగా ప్రయాణించే అవకాశం ఉంది.దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, తూర్పు గాలులతో ఏర్పడిన ఉపరితల ద్రోణి కొనసాగుతున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా వెల్లడించారు.వీటి ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా ఉరుములు మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు, ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు.