ఇళ్లన్నీ కేంద్రం కడితే మీరేం చేస్తారు?.. సోము వీర్రాజు

విధాత:ఇళ్ల నిర్మాణానికి మొత్తం ఖర్చులన్నీ కేంద్రం ఇస్తుంటే ఇంక మీరీ చేస్తారని సిఎం జగన్ ను, భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు ప్రశ్నించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం సోమవారం ఉదయం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నుంచి మొత్తం నిధులు తీసుకుని తమ పేర్లు పెట్టుకుంటున్నారని విమర్శించారు. రైతులకు కనీస మద్దతు ధరను ఇప్పించని ప్రభుత్వం వారిని దోచేస్తుందని ఆవేదన చెందారు. అస్తిపన్నుల పెంపు, చెత్తపై పన్నుల విధింపును […]

ఇళ్లన్నీ కేంద్రం కడితే మీరేం చేస్తారు?..   సోము వీర్రాజు

విధాత:ఇళ్ల నిర్మాణానికి మొత్తం ఖర్చులన్నీ కేంద్రం ఇస్తుంటే ఇంక మీరీ చేస్తారని సిఎం జగన్ ను, భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు ప్రశ్నించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం సోమవారం ఉదయం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నుంచి మొత్తం నిధులు తీసుకుని తమ పేర్లు పెట్టుకుంటున్నారని విమర్శించారు. రైతులకు కనీస మద్దతు ధరను ఇప్పించని ప్రభుత్వం వారిని దోచేస్తుందని ఆవేదన చెందారు. అస్తిపన్నుల పెంపు, చెత్తపై పన్నుల విధింపును భాజపా వ్యతిరేకిస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక చెప్పారు. విధానాలపై జనసేనతో కలపి పోరాడతామన్నారు. ఈ ప్రభుత్వాలు మిల్లర్ల చేతిలో కీలుబొమ్మలు. మిల్లర్లదళారుల చేతిలో రైతులు నష్టపోతున్నారు. రైతులకు భరోసా ఇవ్వడానికి భాజపా పెద్దఎత్తున ఉద్యమాలు చేసి వత్తిడి తెస్తుంద‌న్నారు.

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో రాష్ట్రం ఇళ్లను కడుతున్నా ఎక్కడా పిఎంఏవై పేరు కనిపించదు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి 23 లక్షల ఇళ్లను రాష్ట్రానికి ఇవ్వడానికి ప్రతిపాదనలు పంపారు. కాని రాష్ట్రం 15 లక్షల ఇళ్లనే కడతామంది. ఒక్కో ఇంటికి రూ.1.50 లక్షలు, నరేగా కింద మరో రూ.30 వేలు మొత్తం రూ.1.80 లక్షలు ఇస్తుంది. మొత్తం రూ.15 లక్షల ఇళ్లకు 23 వేల కోట్లు ఇస్తుంది. ఇవి మొత్తం ఖర్చుచేస్తే మరో 8 లక్షల ఇళ్లు ఇస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 30 లక్షల పట్టాల కాలనీలకు రూ.3వేల కోట్ల ఖర్చుతో నరేగా నిధులతో రోడ్లు వేశారు. 30 లక్షల స్థల సేకరణకు 23 వేల కోట్ల లెక్కలు చెబుతున్నారు. ఇందులో కేవలం రూ.7 వేల కోట్లుమాత్రమే ఖర్చుచేసారు. మిగతాదంతా ప్రభుత్వ భూములే. వాటికే లెక్కవేసి మొత్తం రూ.23 వేల కోట్లు చెబుతున్నారు. ఇప్పుడు మౌలిక సదుపాయాల పేరు చెప్పి మరో రూ.4 వేల కోట్లు కావాలని కేంద్రాన్ని అడుగుతున్నారు. లబ్దిదారులకు సబ్సిడీ ఇవ్వక, మౌలికసదుపా యాలకు డబ్బు ఇవ్వక కేంద్ర నిధులతోనే ఇళ్ల కడితే ఇంక మీరెందుకు? కాని మీ తండ్రి. మీవి పేర్లు పెట్టుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం లబ్దిదారులకు లక్ష సబ్సిడీ ఇవ్వాలి. ఇసుక ఉచితంగా, సిమెంటు సబ్సిడీపై ఇవ్వాలి. ఇళ్లను ప్రజలే కట్టుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోరాదు.
ప్రజాపక్షంగా భాజపా, జనసేన కలసి పోరాడతాం అన్నారు.