పంచాయతీలు ఉండగా గ్రామ సచివాలయాలు ఎందుకు.. ఏపీ హైకోర్టు

జీవో నెంబర్ 2 అమలుపై హైకోర్టులో వాడిగా, వేడిగా వాదనలు సర్పంచులు, కార్యదర్శుల అధికారాలను లాగేసు కోవడం ఏమిటి.? గ్రామ పంచాయతీల నే బలోపేతం చేయవచ్చు కదా.రాష్ట్రానికి సీఎం ఎలాగో, అదేవిధంగా గ్రామానికి సర్పంచ్ అధిపతి. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు ప్రభుత్వ పథకాలను అట్టడుగున ఉన్న లబ్ధిదారునికి అందే విధంగా చేయడమే గాక గ్రామస్థాయిలో సమర్థవంతమైన పాలన అందించేందుకు సచివాలయ వ్యవస్థ ను ఏర్పాటు చేశామన్న ప్రభుత్వం జీవో నెంబర్ 2 పై వాదనలు పూర్తి […]

పంచాయతీలు ఉండగా గ్రామ సచివాలయాలు ఎందుకు.. ఏపీ హైకోర్టు

జీవో నెంబర్ 2 అమలుపై హైకోర్టులో వాడిగా, వేడిగా వాదనలు

సర్పంచులు, కార్యదర్శుల అధికారాలను లాగేసు కోవడం ఏమిటి.? గ్రామ పంచాయతీల నే బలోపేతం చేయవచ్చు కదా.రాష్ట్రానికి సీఎం ఎలాగో, అదేవిధంగా గ్రామానికి సర్పంచ్ అధిపతి.

రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

ప్రభుత్వ పథకాలను అట్టడుగున ఉన్న లబ్ధిదారునికి అందే విధంగా చేయడమే గాక గ్రామస్థాయిలో సమర్థవంతమైన పాలన అందించేందుకు సచివాలయ వ్యవస్థ ను ఏర్పాటు చేశామన్న ప్రభుత్వం

జీవో నెంబర్ 2 పై వాదనలు పూర్తి

మధ్యంతర ఉత్తర్వుల వెల్లడి పై నిర్ణయం వాయిదా.రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శులు మరియు పంచాయతీ సర్పంచ్ల అధికారాలను కొన్నిటిని విఆర్వో లకు బదిలీ చేస్తూ జారీ చేసిన జీవో ఎంఎస్ నెంబర్ 2 ను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది .

పిటిషన్ను విచారించిన జస్టిస్ దేవానంద్ ఈ పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులను రిజర్వు చేసుకుంటూ ఆదేశాలిచ్చారు .ఈ జీవో రాజ్యాంగంలోని 73 సవరణకు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టాన్ని కి భిన్నంగా గో వివోల్టేస్ తిము పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు.రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ హాజరయ్యారు వాదనలు విన్న ధర్మాసనం జస్టిస్ దేవానంద్ కేసుపై మధ్యంతర ఉత్తర్వులు రిసర్వ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు.