రాఖీ పండుగ వేళ..షర్మిల ట్వీట్ వైరల్ !

రాఖీ పండుగ సందర్భంగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్. షర్మిల చేసిన భావోద్వేగ ట్వీట్ నెట్టింటా వైరల్‌గా మారింది.

రాఖీ పండుగ వేళ..షర్మిల ట్వీట్ వైరల్ !

విధాత : రాఖీ పండుగ వేళ ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్. షర్మిల చేసిన భావోద్వేగ ట్వీట్ వైరల్ గా మారింది. షర్మిల తన ట్వీట్ లో అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళ ప్రేమానురాగాలకు, ఆప్యాయతకు రక్షా బంధన్ ప్రతీక అంటూ రాష్ట్రంలోని ప్రతి అన్నకు, తమ్ముడికి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపింది. అన్ని బంధాల కన్నా రక్త సంబంధం గొప్పది..నాతో రక్త సంబంధం లేకపోయినా, వైఎస్సాఆర్ అనే మూడక్షరాల అనుబంధాన్ని రక్త సంబంధంగా ఏర్పరుచుకొని నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ప్రతి అన్న, తమ్ముడు సుఖ సంతోషాలతో ఎల్లప్పుడూ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానంటూ ట్వీట్ లో రాసుకొచ్చారు.

ఆమె ట్వీట్ నెట్టింటా వైరల్ గా మారింది. తన అన్న వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్.జగన్ తో ఏర్పడిన విభేధాలతో దూరమైన షర్మిల ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా ఆయనకు రాజకీయ ప్రత్యర్థిగా మారిపోయారు. ఈ నేపథ్యంలో వారి మధ్య రాఖీ వేడుక కూడా దూరమైనప్పటికి.. షర్మిల తన ట్వీట్ లో అన్ని బంధాల కన్నా రక్త సంబంధం గొప్పది అంటూ గుర్తు చేసుకోవడం ద్వారా తన సోదర ప్రేమను చాటుకున్నారంటున్నారు నెటిజన్లు.

 

Read more : శివ రీ రిలీజ్..కూలీ రోజునే ట్రైలర్ లాంచ్.. చైన్ ఈజ్ బ్యాక్!

మంత్రి ఉత్తమ్ : ఎస్‌ఎల్‌బీసీ పునరుద్ధరణకు రూట్ మ్యాప్