వైఎస్ వివేకా హత్య కేసు: అనుమానితులను ప్రశ్నిస్తున్న సీబీఐ
విధాత,పులివెందుల:మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ 64వ రోజు కొనసాగుతోంది. పులివెందుల ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో అధికారులు ఇవాళ ఎనిమిది మంది అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. వీరిలో పులివెందులకు చెందిన శిఖామణి, ఓబులేసు, రఘునాథరెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, సంపత్, నీలయ్య,శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు. మరోవైపు వివేకా హత్యకు వాడిన మారణాయుధాల వెలికితీత ఇవాళ కూడా కొనసాగుతోంది. సీబీఐ కస్టడీలో ఉన్న సునీల్ యాదవ్ విచారణలో చెప్పిన అంశాల ఆధారంగా పులివెందులలోని రోటరీపురం వీధి సమీపంలోని ఓ కాలువలో […]

విధాత,పులివెందుల:మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ 64వ రోజు కొనసాగుతోంది. పులివెందుల ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో అధికారులు ఇవాళ ఎనిమిది మంది అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. వీరిలో పులివెందులకు చెందిన శిఖామణి, ఓబులేసు, రఘునాథరెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, సంపత్, నీలయ్య,శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు. మరోవైపు వివేకా హత్యకు వాడిన మారణాయుధాల వెలికితీత ఇవాళ కూడా కొనసాగుతోంది. సీబీఐ కస్టడీలో ఉన్న సునీల్ యాదవ్ విచారణలో చెప్పిన అంశాల ఆధారంగా పులివెందులలోని రోటరీపురం వీధి సమీపంలోని ఓ కాలువలో పడేసిన మారణాయుధాలను వెలికితీసేందుకు వరుసగా మూడో రోజు ప్రయత్నిస్తున్నారు. సీబీఐ బృందం పులివెందులలోనే వారం పాటు ఉండనున్నట్లు సమాచారం.