ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుంది

విధాత‌:ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుంద‌ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు.మాజీమంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమాపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ కేసులు బనాయించి, జైలుకు పంపడం విచారకరమ‌ని పాలనా వైఫల్యాల గురించి ప్రశ్నించిన ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు,గృహ నిర్భంధాలు, ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టటం తగదన్నారు. కొండపల్లి లో అక్రమ క్వారీయింగ్ తవ్వకాలు, ఆక్రమణలు గురించి ప్రశ్నించిన దేవినేని ఉమాపై వైసిపి వర్గీయులు దాడి చేయటం దుర్మార్గం.పోలీస్ స్టేషన్లు […]

ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుంది

విధాత‌:ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుంద‌ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు.మాజీమంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమాపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ కేసులు బనాయించి, జైలుకు పంపడం విచారకరమ‌ని పాలనా వైఫల్యాల గురించి ప్రశ్నించిన ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు,గృహ నిర్భంధాలు, ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టటం తగదన్నారు.

కొండపల్లి లో అక్రమ క్వారీయింగ్ తవ్వకాలు, ఆక్రమణలు గురించి ప్రశ్నించిన దేవినేని ఉమాపై వైసిపి వర్గీయులు దాడి చేయటం దుర్మార్గం.పోలీస్ స్టేషన్లు జగనన్న స్టేషన్లుగా మారాయి.ప్రజాతంత్ర వాదులంతా ప్రభుత్వ, పోలీసు చర్యలను ఖండించాలని ఆయ‌న పేర్కొన్నారు.