నిమ్స్ విస్తరణకు రూ.1,571 కోట్లు కేటాయింపు
విధాత: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిని బలోపేతం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి మొదలు జిల్లా జనరల్ ఆస్పత్రులతో పాటు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల వరకు అభివృద్ధి చేస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తూ, రోగులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో ఉన్న నిమ్స్ విస్తరణకు కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిమ్స్ ఆస్పత్రికి ప్రతి రోజు కొన్ని […]

విధాత: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిని బలోపేతం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి మొదలు జిల్లా జనరల్ ఆస్పత్రులతో పాటు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల వరకు అభివృద్ధి చేస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తూ, రోగులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తుంది.
ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో ఉన్న నిమ్స్ విస్తరణకు కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిమ్స్ ఆస్పత్రికి ప్రతి రోజు కొన్ని వేల మంది వైద్యం కోసం వస్తుంటారు. తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వైద్యం కోసం వస్తుంటారు. నిమ్స్ పేదల పాలిట ఒక వరమని కూడా చెప్పొచ్చు. రోజురోజుకు రోగులు ఎక్కువై పోతుండటంతో.. ఆ ఆస్పత్రిని విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
నిమ్స్ విస్తరణకు రూ. 1,571 కోట్ల నిధులను కేటాయిస్తూ వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నిమ్స్ విస్తరణ ప్రాజెక్టుకు పరిపాలన అనుమతులను కూడా ప్రభుత్వం మంజూరు చేసింది. పనులను ఆర్ అండ్ బీ శాఖకు అప్పగించింది. త్వరలోనే టెండర్లను పిలవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నాం : హరీశ్‌రావు
నిమ్స్ విస్తరణకు ప్రభుత్వం నిధులు కేటాయించడం పట్ల రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఆరోగ్య తెలంగాణ కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని, అందులో భాగంగానే ప్రభుత్వం మరో ముందడుగు వేసి, నిమ్స్ విస్తరణకు రూ. 1,571 కోట్లు కేటాయించిందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి స్పష్టం చేశారు. ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు.