మునుగోడు: మరోసారి బీజేపీ నేత వద్ద రూ. కోటి నగదు పట్టివేత
విధాత: మునుగోడు ఉప ఎన్నికకు తరలిస్తున్న కోటి రూపాయలను నార్సింగి రోటరీ వద్ద పోలీసులు పట్టుకున్నారు. కోకాపేట నుంచి మునుగోడుకు భారీగా డబ్బు తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో హైదరాబాద్ శివారులోని నార్సింగి రోటరీ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో రెండు కార్లలో తరలిస్తున్న రూ. కోటి నగదుతో పాటు, రెండు కార్లు, ఓ మోటర్ సైకిల్, 6 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదును తరలిస్తున్న ఐదుగురు వ్యక్తులను […]

విధాత: మునుగోడు ఉప ఎన్నికకు తరలిస్తున్న కోటి రూపాయలను నార్సింగి రోటరీ వద్ద పోలీసులు పట్టుకున్నారు. కోకాపేట నుంచి మునుగోడుకు భారీగా డబ్బు తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో హైదరాబాద్ శివారులోని నార్సింగి రోటరీ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు.
ఈ క్రమంలో రెండు కార్లలో తరలిస్తున్న రూ. కోటి నగదుతో పాటు, రెండు కార్లు, ఓ మోటర్ సైకిల్, 6 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదును తరలిస్తున్న ఐదుగురు వ్యక్తులను దేవరాజు, శ్రీకాంత్, విజయ్ కుమార్, నాగేశ్, దాసరి లూథర్ లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.
కోకాపేట వాసి సునీల్ రెడ్డి నుంచి రూ. కోటి నగదును తీసుకుని కోమటిరెడ్డి సుమంత్ రెడ్డి, కోమటిరెడ్డి సూర్య పవన్‌కు ఇవ్వడానికి వెళ్తున్నట్టు నిందితులు తెలిపారు.
