ప్రతి సంక్రాంతికి ప్రేక్షకులకి కావల్సినంత వినోదం అందిస్తుంటారు మేకర్స్. ఈ సంక్రాంతికి ఒకవైపు థియేటర్స్లోను మరోవైపు ఓటీటీలోను మంచి వినోదం అందిందచే ప్రయత్నం చేస్తున్నారు. సంక్రాంతికి నాలుగు సినిమాలున్నా గుంటూరు కారం`కి మంచి బజ్ ఉంది. `హనుమాన్ , వెంకీ సైంధవ్ , నాగార్జున నా సామిరంగ చిత్రాలు కూడా ప్రేక్షకులని అలరించే అవకాశం ఉందని విశ్వసిస్తున్నారు. ఇక ప్రతి వారం ఓటీటీల్లోకి పదుల సంఖ్యలో కొత్త సినిమాలు విడుదల అవుతుండగా, ఈ వారంలో మాత్రం ఓటీటీలోకి కూడా బోలెడన్ని సినిమాలు స్ట్రీమింగ్కి రెడీ అయిపోయాయి. ఓటీటీ సినిమాల స్ట్రీమింగ్ విషయానికొస్తే ఏకంగా 29 సినిమాలు, వెబ్ సిరీసులు విడుదల కానున్నాయి.
ముందుగా నెట్ ఫ్లిక్స్ లో చూస్తే.. ఐర్ మతా దీ ఉజుంగ్ సజదా (ఇండోనేసియన్ మూవీ)- జనవరి 08వ తేదీ నుంచి , పీట్ డేవిడ్సన్:టర్బో ఫంజరెల్లి (ఇంగ్లీష్ మూవీ)– జనవరి 09 వ తేదీ నుంచి , డైరీస్ సీజన్ 2:పార్ట్ 2 (ఇటాలియన్ సిరీస్)– జనవరి 09 వ తేదీ నుంచి , ద ట్రస్ట్:ఏ గేమ్ ఆఫ్ గ్రీడ్ (ఇంగ్లీష్ సిరీస్)– జనవరి 10 వ తేదీ నుంచి , కింగ్డమ్ 3:ద ఫ్లేమ్ ఆఫ్ ఫేట్ (జపనీస్ మూవీ)– జనవరి 10 వ తేదీ నుంచి , కూ పాయింట్:సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్)– జనవరి 10 వ తేదీ నుంచి , మంత్ర సురుగణ (ఇండోనేసియన్ చిత్రం) – జనవరి 11 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ , డిటెక్టివ్ ఫోస్ట్ (పోలిష్ సిరీస్)– జనవరి 11 వ తేదీ నుంచి, ఛాంపియన్ (ఇంగ్లీష్ సిరీస్)– జనవరి 11 వ తేదీ నుంచి , బాయ్ స్వాలోస్ యూనివర్స్ (ఇంగ్లీష్ సిరీస్)– జనవరి 11 వ తేదీ నుంచి , కిల్లర్ సూప్ (హిందీ సిరీస్)– జనవరి 11 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ , సోనిక్ ప్రైమ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్)– జనవరి 11 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతున్నాయి.
ఇక లిఫ్ట్ (ఇంగ్లీష్ మూవీ)– జనవరి 12 వ తేదీ నుంచి, అడిరే (ఇంగ్లీష్ సినిమా)– జనవరి 12 వ తేదీ నుంచి ,లవ్ ఈజ్ బ్లైండ్:స్వీడన్ (స్వీడిష్ సిరీస్)– జనవరి 12 వ తేదీ నుంచి , ఎక్స్ ట్రా ఆర్డినరి మ్యాన్ (తెలుగు మూవీ)– జనవరి 12 వ తేదీ నుంచి, డంబ్ మనీ (ఇంగ్లీష్ మూవీ)– జనవరి 13 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి. ఇక జీ5 లో అజయ్ గాడు (తెలుగు సినిమా)– జనవరి 12 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. మరోవైపు అమెజాన్ ప్రైమ్ లో మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్ పార్ట్ 1 (తెలుగు డబ్బింగ్ మూవీ) – జనవరి 11 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఇక 90 హరి మెంకారి సువామి (ఇండోనేసియన్ మూవీ)– జనవరి 11 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుండగా, రోల్ ప్లే (ఇంగ్లీష్ సినిమా)– జనవరి 12 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
సోనీ లివ్ లో చూస్తే.. ఆపిల్ ప్లస్ టీవీ క్రిమినల్ రికార్డ్ (ఇంగ్లీష్ సిరీస్)– జనవరి 10 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. జియో సినిమా లా బ్రియా సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్)– జనవరి 10 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. టెడ్ (ఇంగ్లీష్ సిరీస్)– జనవరి 12 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. చేరన్స్ జర్నీ (తెలుగు డబ్బింగ్ సిరీస్)– జనవరి 12 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. బుక్ మై షోలో జస్టిస్ లీగ్: క్రైసిస్ ఆన్ ఇన్ఫైనిట్ ఎర్త్ (ఇంగ్లీష్ సినిమా)– జనవరి 09 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. వన్ మోర్ షాట్ (ఇంగ్లీష్ మూవీ)– జనవరి 09 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. హాట్స్టార్ లో ఎకో (ఇంగ్లీష్ సిరీస్)– జనవరి 11 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్)– జనవరి 12వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.