Ap: కస్తూరి గురుకుల పాఠశాలలో.. 30 మంది విద్యార్థినులకు అస్వస్థత
విధాత: అన్నమయ్య జిల్లాలోని వీరబల్లి మండలం కస్తూరి బాలికల గురుకుల పాఠశాలలో కలుషిత భోజనం తిని 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. భోజనం తిన్న తరువాత విద్యార్థినులకు ఒక్కొక్కరిగా వాంతులు, విరేచనాలు మొదలై పలువురు స్పృహ తప్పి పడిపోయారు. విషయం తెలుసుకున్న అధ్యాపకులు విద్యార్థినులను ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వెంటనే జిల్లా స్థాయి అధికారులు స్పందించి, ఘటన కారకులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థినుల తల్లిదండ్రులు కోరారు.

విధాత: అన్నమయ్య జిల్లాలోని వీరబల్లి మండలం కస్తూరి బాలికల గురుకుల పాఠశాలలో కలుషిత భోజనం తిని 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. భోజనం తిన్న తరువాత విద్యార్థినులకు ఒక్కొక్కరిగా వాంతులు, విరేచనాలు మొదలై పలువురు స్పృహ తప్పి పడిపోయారు.
విషయం తెలుసుకున్న అధ్యాపకులు విద్యార్థినులను ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వెంటనే జిల్లా స్థాయి అధికారులు స్పందించి, ఘటన కారకులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థినుల తల్లిదండ్రులు కోరారు.