MLC Kavitha | బీఆరెస్ ఎమ్మెల్సీ కవితకు ౭ రోజుల కస్టడీ

ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆరెస్ ఎమ్మెల్సీ కవితకు 7 రోజుల రిమాండ్, కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. ఈ నెల 23వరకు ఆమె ఏడు రోజుల పాటు ఈడీ కస్టడీలో ఉండనుంది

MLC Kavitha | బీఆరెస్ ఎమ్మెల్సీ కవితకు ౭ రోజుల కస్టడీ
  • రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు


విధాత: ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆరెస్ ఎమ్మెల్సీ కవితకు 7 రోజుల రిమాండ్, కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. ఈ నెల 23వరకు ఆమె ఏడు రోజుల పాటు ఈడీ కస్టడీలో ఉండనున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో సౌత్ గ్రూప్ లాబీయింగ్ ద్వారా 100కోట్లు ఆప్‌కు అందించడంలో కవిత ప్రమేయం ఉందని ఈడీ అభియోగాలు మోపింది. ఈ అభియోగాలపై కస్టడీలో ఈడీ అధికారులు కవితను విచారణ చేయనున్నారు.


దాదాపు 30కోట్లను అభిషేక్ బోయినపల్లి ఢిల్లీ తీసుకెళ్లారని, కవితకు బినామీగా రామచంద్రపిళ్లై ఉన్నారని, ఎంపీ మాగుంట ద్వారా 30కోట్లు ఢిల్లీకి కవిత అందించారని ఈడీ కస్టడీ పిటిషన్‌లో పేర్కొంది.  కవితతో కలిసి వారితో పాటు కవిత భర్త అనిల్‌తో పాటు అమిత్ అరోరా, పీఏ అశోక్ కౌశీక్‌లను కలిపి విచారించనున్నారని సమాచారం. ఇప్పటి వరకు ఢిల్లీ లిక్కర్ కేసులో కవితతో పాటు 13మంది అరెస్టు కాగా, వారిలో కొందరు జైలులో ఉండగా, మరికొందరు బెయిల్‌పై బయట ఉన్నారు.