డాక్టర్‌పై 18 సార్లు కొడవలితో దాడి.. ఆర్థిక లావాదేవిలే కారణమా..?
మహారాష్ట్రలోని నాసిక్‌లో ఘోరం జరిగింది. ఓ డాక్టర్‌పై 18 సార్లు కొడవలితో విచక్షణారహితంగా నరికాడు. బాధిత డాక్టర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ముంబై : మహారాష్ట్రలోని నాసిక్‌లో ఘోరం జరిగింది. ఓ డాక్టర్‌పై 18 సార్లు కొడవలితో విచక్షణారహితంగా నరికాడు. బాధిత డాక్టర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
వివరాల్లోకి వెళ్తే.. నాసిక్‌లోని పంచవటి ఏరియాలో డాక్టర్ కైలాష్ రాథి(48) ఓ ప్రయివేటు హాస్పిటల్ నిర్వహిస్తున్నారు. అయితే శుక్రవారం రాత్రి డాక్టర్ ఆస్పత్రిలోనే ఫోన్‌లో మాట్లాడుతుండగా, అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి కొడవలితో దాడి చేశాడు. 18 సార్లు మెడ, గొంతు, ముఖంపై విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం అక్కడ్నుంచి అతను వెళ్లిపోయాడు. ఈ భయంకరమైన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. డాక్టర్‌ను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. బాధితుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఆర్థిక లావాదేవిలే కారణమా..?
అయితే ఓ మహిళ.. డాక్టర్ కైలాష్ హాస్పిటల్‌లో పని చేస్తుంది. ఆమె హాస్పిటల్‌కు సంబంధించిన రూ. 6 లక్షలను దుర్వినియోగం చేసింది. దాంతో ఆమెను విధుల నుంచి తొలగించారు. తర్వాత కొద్ది రోజులకు మళ్లీ ఉద్యోగంలో చేర్చుకున్నారు. ఈసారి అప్పుగా రూ. 12 లక్షలు తీసుకుంది. ఈ నగదు చెల్లించే విషయంలో డాక్టర్‌కు, ఉద్యోగినికి మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. దీంతో ఆమె భర్త.. డాక్టర్‌పై కక్ష పెంచుకుని, కొడవలితో దాడికి పాల్పడినట్లు తెలిసింది.