కొవిడ్ సోకిన మ‌హిళ‌ల్లో త‌గ్గిన శృంగార ఆస‌క్తి..!

కొంతమందికి ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, సుదీర్ఘ కోవిడ్ ల‌క్ష‌ణాలు.. మాన‌సికంగా, శారీర‌కంగా మ‌హిళ శృంగారంపై ప్ర‌భావాన్ని చూపుతున్న‌ట్లు తేలింద‌న్నారు.

కొవిడ్ సోకిన మ‌హిళ‌ల్లో త‌గ్గిన శృంగార ఆస‌క్తి..!

శృంగారం.. ఈ ప‌దం శ‌రీరంలోని ప్ర‌తి అవ‌య‌వాన్ని ఉత్తేజితం చేస్తోంది. ఎంతో ఉత్సాహాంతో మ‌న‌కు తెలియ‌కుండానే మ‌న మ‌న‌సు ఉర‌కలేస్తోంది. మ‌రి అంత‌టి అనుభూతి క‌లిగించే శృంగారాన్ని.. ప్ర‌తి జంట త‌నివితీరా అనుభ‌వించాల‌ని కోరుకుంటారు. కానీ కొన్ని సంద‌ర్భాల్లో అది సాధ్యం కాక‌పోవ‌చ్చు. ఎందుకంటే.. మానసిక ఒత్తిళ్లు, ఆరోగ్య స‌మ‌స్య‌లు, ఇత‌ర కార‌ణాలు ఉండొచ్చు. అయితే ఇప్పుడు తాజాగా మ‌రో కొత్తం విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. క‌రోనా బారిన ప‌డి కోలుకున్న మ‌హిళ‌ల్లో శృంగార స‌మ‌స్య‌లు నెల‌కొన్న‌ట్లు ఓ అధ్య‌య‌నంలో తేలింది. క‌రోనా బాధిత మ‌హిళ‌లు త‌మ భాగ‌స్వామితో శృంగారం చేసేందుకు ఎక్కువ‌గా ఆస‌క్తి చూప‌ట్లేద‌ని వెల్ల‌డైంది. ఈ అధ్య‌య‌నం 2 వేల మంది మ‌హిళ‌ల‌పై జ‌రిగింది.

మీరు కోవిడ్ బారిన ప‌డి ఉంటే.. అది శృంగార స‌మ‌స్య‌ల‌కు దారితీస్తుంద‌ని బోస్ట‌న్ యూనివ‌ర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ అమెలియా ఎం స్టాంట‌న్ పేర్కొన్నారు. క‌రోనా బారిన ప‌డ్డ మ‌హిళ‌లు శృంగారంపై త‌క్కువ ఆస‌క్తిని క‌లిగి ఉన్న‌ట్లు, వారి శ‌రీరం కూడా ఆ చ‌ర్య‌కు సిద్ధంగా ఉండ‌డం లేద‌ని త‌మ అధ్య‌య‌నంలో వెల్ల‌డైంద‌న్నారు. కానీ కొంతమందికి ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, సుదీర్ఘ కోవిడ్ ల‌క్ష‌ణాలు.. మాన‌సికంగా, శారీర‌కంగా మ‌హిళ శృంగారంపై ప్ర‌భావాన్ని చూపుతున్న‌ట్లు తేలింద‌న్నారు.

అయితే ఈ ప‌రిశోధ‌న‌లో కొవిడ్ సోకిన వారితో పాటు సోక‌ని మ‌హిళ‌లు కూడా పాల్గొన్నారు. క‌రోనా బారిన ప‌డ‌ని మ‌హిళల్లో శృంగార కోరిక‌లు అమితంగా ఉన్న‌ట్లు వెల్ల‌డైంద‌న్నారు. వారు అదే స్థాయిలో శృంగార జీవితాన్ని సంతృప్తిక‌రంగా సాగించిన‌ట్లు తేలింది. కానీ క‌రోనా బారిన ప‌డ్డ మ‌హిళ‌ల్లో శృంగార కోరిక‌లు త‌క్కువ‌గా ఉండ‌టంతో పాటు స‌రైన అనుభూతిని కూడా పొంద‌లేక‌పోతున్నార‌ని ప‌రిశోధ‌న‌లో వెల్ల‌డైంది.

క‌రోనా త‌ర్వాత చాలా జంట‌లు శృంగార స‌మ‌స్య‌ల‌పై ఆస్ప‌త్రుల‌ను విజిట్ చేసిన‌ట్లు అధ్య‌య‌నం పేర్కొంది. అయితే క‌రోనా అనేది శృంగార చ‌ర్య‌కు సంబంధించిన మాన‌సిక స‌మ‌స్య‌ల‌పై కూడా ప్ర‌భావం చూపింద‌ని స్టాంట‌న్ తెలిపారు. కొవిడ్ బారిన ప‌డ్డ‌వారు ర‌క‌ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లకు గుర‌య్యారు.