యూట్యూబ్ ద్వారా అమర్ దీప్ భార్య అన్ని లక్షలు సంపాదిస్తుందా.. నిజంగా గ్రేట్

గతంలో సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన అమర్ దీప్ రీసెంట్‌గా బిగ్ బాస్ లో కనిపించి తెగ సందడి చేశాడు. ఉన్నన్ని రోజులు తెగ వినోదం పంచుతూ టాప్ 2లో నిలిచాడు. విన్నర్ కావాల్సినప్పటికీ చివరి వారంలో అతని ప్రవర్తన కొంత నెగెటివిటీని తీసుకు రావడంతో టాప్ 2కి పరిమితం అయ్యాడు. అమర్ దీప్ సీరియల్ నటి అయిన తేజస్వి గౌడ అనే నటిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత తేజస్విని తెలుగులో సీరియల్స్ చేయకపోయినా కన్నడ, తమిళంలో వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు. తన భర్త అమర్ దీప్ బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్నప్పుడు అతనికి ఫుల్ సపోర్ట్ అందిస్తూ తెగ వార్తలలో నిలిచింది.
తేజస్విని గౌడ ఒకవైపు సీరియల్స్ లో నటిస్తూనే మరొకవైపు యూట్యూబ్ ఛానల్ లో కూడా నటిస్తూ మరింత పాపులారిటీ దక్కించుకుంది. అంతే కాదు ఈ మధ్యకాలంలో తన కెరీర్ పరంగా కాస్త బిజీ అయిన ఈమె పెద్దగా వీడియొలు చేయడం లేదు. అప్పట్లో వరుస వీడియోలు చేస్తూ భారీ స్థాయిలో వ్యూస్ రాబట్టింది. ఆమెకి యూట్యూబ్ ఛానల్లో 16 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో రకాల వీడియోలను షేర్ చేసే ఈమె నెలకి సుమారుగా రూ.30 లక్షల వరకు ఆదాయం అందిపుచ్చుకుంటుందని సమాచారం. యూట్యూబ్ ఛానల్ ద్వారానే ఈ స్థాయిలో సంపాదిస్తుండడంతో ఈ అమ్మడు మిగతా సోషల్ నెట్‌వర్క్స్ ద్వారా ఇంకెంత రాబడుతుందో అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తేజస్విని విషయం తెలుసుకున్న చాలామంది సెలబ్రిటీలు కూడా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి పెద్ద ఎత్తున ఆదాయం పొందుతున్నారు.
ఇక బిగ్ బాస్ హౌజ్‌లో తేజస్విని భర్త అమర్ దీప్ ఉన్న సమయంలో ఈమెని చాలా ట్రోలింగ్ చేశారు. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కు అమర్ కు పెద్ద యుద్దమే జరగగా, ఆ సమయంలో అమర్ ప్రశాంత్ పై దాడి చేయడం.. ఇద్దరి మధ్య వాదోపవాదాలు.. బయట ఇద్దరి ఫ్యాన్స్ సోషల్ మీడియా వార్.. ఇలా గందరగోళం నెలకోంది. అయితే ఆ సమయంలో అమర్‌ని ప్రశాంత్ పీఆర్ టీమ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న వాదన వినిపించింది. ఈక్రమంలో అమర్ దీప్ భర్య నటి తేజస్విని రంగంలోకి దిగింది. సోషల్ మీడియా వేదికగా.. తరచు కొన్ని ఇంటర్వ్యూలు ఇస్తూ.. అమర్ ను టార్గెట్ చేసినవారిని గట్టిగా విమర్షించింది. ప్రశాంత్ ను.. మరియు అతని పీఆర్ టీంని అమర్ దీప్ భార్య తేజస్విని ని ఒక రేంజ్ లో గట్టిగా టార్గెట్ చేస్తూ ఫైర్ అయింది. ఆ సమయంలో తేజస్విని కూడా కొంత ట్రోలింగ్ ఎదుర్కొంది.