మ‌రోసారి వార్త‌ల‌లోకి ప్ర‌భాస్-అనుష్క పెళ్లి..మార్చిలో ఎంగేజ్‌మెంట్, ఏప్రిల్‌లో పెళ్లి

మ‌రోసారి వార్త‌ల‌లోకి ప్ర‌భాస్-అనుష్క పెళ్లి..మార్చిలో ఎంగేజ్‌మెంట్, ఏప్రిల్‌లో పెళ్లి

ప్ర‌స్తుతం టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్స్‌గా ప్ర‌భాస్,అనుష్క ఉన్నారు. వీరి వ‌య‌స్సు 40 ఏళ్లు దాటింది. ఇప్ప‌టికీ పెళ్లి చేసుకోలేదు. గ‌త కొత కాలంగా ఇద్ద‌రు ప్రేమ‌లో ఉన్నార‌ని, పెళ్లి చేసుకుంటార‌ని ప్ర‌చారం జ‌రుగుతుండ‌గా, అందులో నిజం లేద‌ని వారిద్ద‌రే స్వ‌యంగా తెలియ‌జేశారు.అయితే చాలా సార్లు వీరిద్ద‌రు కూడా త‌మ‌కి సంబంధించిన ప్ర‌చారాల‌పై క్లారిటీ ఇచ్చిన కూడా అవి ఏ మాత్రం ఆగ‌డం లేదు. అనుష్క సంగ‌తేమో కాని ప్ర‌భాస్ పెళ్లికి సంబంధించి మాత్రం నెట్టిం అనేక ప్ర‌చారాలు హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి. ఆరడుగుల అందగాడు పెళ్లి చేసుకుంటే చూడాలి అని అభిమానులు వేయి క‌ళ్ల‌తో ఎదురు చూస్తున్నారు.

కాని ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌భాస్ పెళ్లి మాత్రం పోస్ట్‌పోన్ అవుతూనే ఉంది. తాజాగా ప్ర‌భాస్‌ పెళ్లి కి సంబంధించిన టాప్ సీక్రెట్ రెబెల్ ఫ్యామిలీ నుంచి లీక్ అయినట్టు ఓ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. ప్ర‌భాస్- అనుష్క‌లు మార్చిలో ఎంగేజ్‌మెంట్ చేసుకోబోతున్నార‌ని, ఏప్రిల్‌లో వారి వివాహం జ‌ర‌గ‌నుంద‌ని ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారింది. ప్ర‌భాస్ ఓ ఇంటివాడు అయితే చూడాల‌ని ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఎప్ప‌టి నుండో క‌ల‌లు కంటున్నారు. కాని అది జ‌ర‌గ‌డం లేదు. కొంద‌రు అయితే ప్రభాస్ అనుష్కలను జంటగా చూడాలని కోరకుంటున్నారు.గ‌త ఏడాది ఎలాగు వీరి వివాహం జ‌ర‌గ‌లేదు. ఈ ఏడాది అయిన వారు వివాహం చేసుకుంటే బాగుంటుంద‌ని కొంద‌రు భావిస్తున్నారు.

ప్రభాస్- అనుష్క జంట మిర్చి చిత్రంలో న‌టించ‌గా, ఆ చిత్రంలో వీరి కెమిస్ట్రీకి మంచి మార్కులు ప‌డ్డాయి. అప్పటి నుంచే వీరిపై రకరకాల వర్తలు వైరల్ అయ్యాయి. మిర్చి సినిమాలో.. ఒక్క చాన్స్ ఇస్తావా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను అన్నడైలాగ్ ఎంతో ఫేమస్ కాగా, రియ‌ల్ లైఫ్‌లో కూడా వారు అలానే ఉంటార‌ని కొంద‌రు అంటున్నారు. వీరిద్ద‌రు ఇప్ప‌టికే అమెరికాలో ఉండడానికి ఇల్లుకూడా కొన్నారని రూమర్ గట్టిగా నడిచింది. మొన్నటికి మొన్నవీరిద్దరి పెళ్ళి పోటోలు అంటూ.. గ్రాఫిక్ డిజైన్ చేసిన ఫేక్ ఫిక్స్ వైరల్ అయ్యాయి. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. వీరికి ఓ పాప కూడా పుట్టినట్టు చూపించారు . ఇక ప్రస్తుతం ప్రభాస్ దృష్టి అంతా సినిమాల మీదే ఉంది. ఇక అనుష్క కూడా రీసెంట్ గా రీ ఎంట్రీ ఇచ్చింది. నిశ్శబ్ధం సినిమా తరువాత కెరీర్ లో సైలెంట్ అయిన స్వీటీ.. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో అలరించింది.