TRSఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నం.. డబ్బు కట్టలతో పట్టుబడ్డ నలుగురు వ్యక్తులు

విధాత: ఢిల్లీకి చెందిన నలుగురు వ్యక్తులు హైదరాబాద్‌లో నోట్ల కట్టలతో పట్టుబడటం తెలంగాణలో కలకలం రేపింది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో.. తెరాసకు చెందిన కొందరు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు వీరు రంగంలోకి దిగారనే పక్కా సమాచారం అందడంతో పోలీసులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో పాటు, కొల్లాపూర్‌ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు, తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డిలను పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించేందుకు దిల్లీకి […]

TRSఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నం.. డబ్బు కట్టలతో పట్టుబడ్డ నలుగురు వ్యక్తులు

విధాత: ఢిల్లీకి చెందిన నలుగురు వ్యక్తులు హైదరాబాద్‌లో నోట్ల కట్టలతో పట్టుబడటం తెలంగాణలో కలకలం రేపింది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో.. తెరాసకు చెందిన కొందరు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు వీరు రంగంలోకి దిగారనే పక్కా సమాచారం అందడంతో పోలీసులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో పాటు, కొల్లాపూర్‌ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు, తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డిలను పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించేందుకు దిల్లీకి చెందిన వ్యక్తులు ప్రయత్నించినట్టు పోలీసులు చెబుతున్నారు.

రెండ్రోజులుగా ఈ నలుగురూ.. ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో పక్కా సమాచారంతో తెలంగాణ పోలీసులు ఆపరేషన్‌ నిర్వహించారు. నగరశివారులోని ఓ ఫామ్‌హౌస్‌లో ఎమ్మెల్యేలతో బేరసారాలు జరుగుతున్న సమయంలో పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. దీనిపై కాసేపట్లో సైబరాబాద్‌ పోలీసులు అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశముంది.

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సమాచారంతోనే రైడ్‌ చేశాం : సీపీ స్టీఫెన్‌ రవీంద్ర

బీజేపీ ఆకర్ష్‌ను సైబరాబాద్‌ పోలీసులు చేధించారు. టీఆర్‌ఎస్‌ను దెబ్బకొట్టేందుకు ఆ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతూ బేరసారాలు జరిపిన ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. అరెస్ట్‌ అనంతరం సీపీ స్టీఫెన్‌ రవీంద్ర మీడియాతో మాట్లాడారు. దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. తమను కొంతమంది ప్రలోభ పెడుతున్నారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సమాచారం అందించారని సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు.

డబ్బు, కాంట్రాక్టులు, ఇతర పదవులు ఇస్తామని ఆశచూపారని పేర్కొన్నారు. వారిచ్చిన సమాచారంతో ఫామ్‌ హౌజ్‌పై రైడ్‌ చేశామన్నారు. ఈ రైడ్‌లో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. వీరిలో ఢిల్లీ నుంచి వచ్చిన పీఠాధిపతి రామచంద్ర భారతి అలియాస్‌ సతీశ్‌ శర్మ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపారని పేర్కొన్నారు.

రామచంద్రభారతితో పాటు ఫామ్‌హౌజ్‌లో తిరుపతి నుంచి వచ్చిన సింహయాజులు, హైదరాబాద్‌కు చెందిన నందకుమార్‌ ఉన్నారని చెప్పారు. వీళ్లు ఏమని ప్రలోభ పెట్టారనే దానిపై విచారణ జరుపుతున్నామని.. వీరిపై లీగల్‌ యాక్షన్‌ తీసుకుంటామని పేర్కొన్నారు.