అవినాష్‌కి తీర‌ని శోకం.. బిడ్డ పుట్టకుండానే లోకాన్ని విడిచి వెళ్లింది

అవినాష్‌కి తీర‌ని శోకం.. బిడ్డ పుట్టకుండానే లోకాన్ని విడిచి వెళ్లింది

జ‌బ‌ర్ధ‌స్త్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అవినాష్ బిగ్ బాస్ షోతో మరింత పాపుల‌ర్ అయ్యాడు. ఇప్పుడు ప‌లు టీవీ షోలు చేస్తూ అలానే సినిమాల‌లో ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. అంతేకాదు సోష‌ల్ మీడియాలోను చాలా యాక్టివ్‌గా ఉంటూ త‌న‌కి సంబంధించిన అనేక విష‌యాలు తెలియ‌జేస్తూ వ‌స్తున్నాడు. గ‌త కొద్ది రోజులుగా తన భార్య అనూజ ప్రెగ్నెన్సీ వీడియోలను, సీమంతం గురించి చెబుతూనే వచ్చాడు. ఇక బిడ్డ పుడుతుంది.. చేతులో ఎత్తుకోవాలి.. కళ్లారా బిడ్డను చూసుకొని ఎంతో మురిసిపోవాలి అనుకున్న అవినాష్‌కి పెద్ద షాక్ త‌గిలింది. అనూజకు అబార్షన్ కావ‌డంతో బిడ్డ పుట్ట‌కుండానే చ‌నిపోయింది.. ఈ విష‌యాన్ని చాలా ఎమోష‌న‌ల్ అవుతూ తెలియ‌జేశాడు అవినాష్‌.

త‌న సోష‌ల్ మీడియా పోస్ట్‌లో నా లైఫ్ లో సంతోషమైన, బాధ అయినా… నా ఫ్యామిలీ అయినా మీతోనే పంచుకుంటాను. ఇప్పటి వరకు నా ప్రతి ఆనందాన్ని మీతోనే పంచుకున్నాను. కానీ మొదటి సారి నా జీవితంలో జరిగిన ఒక విషాదాన్ని మీతో పంచుకుందాం అని అనుకుంటున్నాను. మేము అమ్మ నాన్న అవ్వాలనే ఆ రోజు కోసం ఎదురు చూసాం. కానీ కొన్ని కారణాల వల్ల మేము మా బిడ్డనీ కొల్పోయాం. ఈ విషయం మేము ఎప్పటికీ జీర్ణించుకోలేనిది. అంత తొందరగ మర్చిపోలేనిది. మీకు ఎప్పటికైనా చెప్పాలీ అన్న బాధ్యతతో ఈ విషయాన్నీ మీతో పంచుకుంటున్నాను. ఇప్పటివరకు మీరు మాపై చూపించిన ప్రేమకీ థంక్యూ. మీ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే దయచేసి ఈ విషయంపై ఎలాంటి ప్రశ్నలు అడిగి మమ్మల్ని బాధ పెట్టవద్దు. మీరందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటూ మీ అనూజ అవినాష్’.. అంటూ రాసుకొచ్చాడు.

ఇక ఈ పోస్ట్‌పై ప‌లువురు ప్ర‌ముఖులు స్పందిస్తూ ధైర్యంగా ఉండ‌మ‌ని ధైర్యం చెబుతున్నారు. హరితేజ, శ్రీముఖి, మహి శివన్, మెహబూబ్, సింగర్ సోనీ, యాంకర్ శివ, ఎక్స్‌ప్రెస్ హరి ఇలా చాలా మంది అవినాష్‌కు ధైర్యం అందించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.ఇక ఇదిలా ఉంటే అవినాష్ కరోనా స‌మ‌యంలో చాలా ఇబ్బందులు ప‌డ్డాడ‌ని ఆ స‌మ‌యంలో సూసైడ్ కూడా చేసుకోవాల‌ని అనుకున్నాడ‌ని ఇటీవ‌ల ఆయ‌న సోద‌రుడు ఇంట‌ర్వ్యూలో తెలియ‌జేశారు.