సినిమాలకి గుడ్ బై చెప్పబోతున్న బాలయ్య.. ఫ్యాన్స్‌లో కలవరం…!

విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నందమూరి బాలకృష్ణ తండ్రికి తగ్గ తనయుడు అనిపించాడు. నటుడిగా తన సత్తా ఏంటో తెలుగు ప్రజలకి చూపించాడు. అన్ని రకాల జానర్స్‌లో సినిమాలు చేసి భళా అనిపించారు బాలయ్య. ఆరు పదుల వయస్సులోను బాలయ్య చాలా ఉత్సాహంగా సినిమాలు చేయడమే కాక ఓటీటీలోను తెగ సందడి చేస్తున్నాడు..ఎప్పటికప్పుడు కొత్త ,యంగ్ డైరక్టర్స్ ని కలుస్తూ వారి కథలు వింటూ వైవిధ్యమైన సినిమాలకి శ్రీకారం చుడుతున్నాడు. ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ బాబీతో సినిమా చేస్తుండగా, ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. 2024లోనే మూవీని రిలీజ్ చేయనున్నట్టు సమాచారం.
ప్రస్తుతం బాలయ్య నటుడిగానే కాదు రాజకీయ నాయకుడిగా కూడా ప్రజల మనస్సులు చూరగొంటున్నారు. మరి కొద్ది రోజులలో ఏపీ ఎలక్షన్స్ జరగనున్న నేపథ్యంలో బాలకృష్ణ తన సినిమాలకి కొన్ని రోజులు బ్రేక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. బాబి తో చేస్తున్న చిత్రం ఈ నెలాఖరకు ఓ షెడ్యూల్ పూర్తవుతుంది. దాంతో కొన్నాళ్లు సినిమాకి బ్రేక్ ఇచ్చి ఎలక్షన్స్‌పై పూర్తి దృష్టి పెడతారట.టీడీపీకి పూర్తి సమయం కేటాయించాలని భావిస్తున్న నేపథ్యంలో సినిమా పనులకి చిన్న విరామం ఇస్తారని టాక్ నడుస్తుంది. ఎలక్షన్స్ పూర్తయ్యాక తిరిగి మళ్లీ సినిమా పనులతో బిజీబిజీగా ఉండనున్నట్టు సమాచారం.
బాలయ్య ప్రస్తుతం హిందూపూర్ నియోజక వర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఒకవైపు సినిమా షూటింగ్‌లలో పాల్గొంటూనే మరోవైపు తన నియోజకవర్గం సమస్యలపై కూడా దృష్టి సారిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఎలక్షన్స్ తో బాలయ్య బిజీగా ఉంటున్న నేపథ్యంలో బాలయ్య కొత్త సినిమాల ఎనౌన్సమెంట్ సైతం ఎలక్షన్స్ తర్వాతే ఉంటుంది. ఇక బాబీ సినిమా తర్వాత బాలయ్య .. రాహుల్ సాంకృత్యన్‌తో సినిమా చేయనున్నాడు. ఇప్పటికే ఆయన బాలయ్యని కలిసి స్టోరీ లైన్ వినిపించాడని, పీరియాడిక్ డ్రామాగా చిత్రాన్ని రూపొందించనున్నాడని సమాచారం. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించనున్నారు.