వైరల్ అవుతున్న బాలయ్య వెడ్డింగ్ కార్డ్.. ఇందులో స్పెషల్ ఏంటంటే..!

నందమూరి తారకరామారావు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలయ్య అంచెలంచెలుగా ఎదిగి ఎనలేని కీర్తి ప్రతిష్టలు కూడా సంపాదించుకున్నారు. ఆయనకు ఇప్పటికీ కూడా ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే చాలు.. జనం ఊగిపోతారు. ఫ్యాన్స్ చొక్కాలు చింపుకుంటారు. జై బాలయ్య అంటూ నినాదాలతో హోరెత్తిస్తుంటారు. ప్రస్తుతం వరుస సినిమాలతో జోష్ మీదున్న సంగతి తెలిసిందే. గత ఏడాది వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో సక్సెస్ కొట్టిన బాలయ్య అంతక ముందు అఖండ చిత్రంతో ఓ మంచి హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో వరుసగా మూడు సక్సెస్‌లు సాధించి బాక్సాఫీస్ దగ్గర హ్యట్రిక్ కొట్టాడు.
ప్రస్తుతం యువ దర్శకుడు బాబీ దర్శకత్వంలో తన 109వ చిత్రం చేస్తున్నాడు బాలయ్య. ప్రస్తుతం ఈమూవీ షూటింగ్ దశలో ఉంది. కొన్ని రోజులు షూటింగ్ చేసి ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో బాలయ్య బిజీ కానున్నట్టు ప్రచారం జరుగుతుంది. అయితే తాజాగా బాలయ్య పెళ్లికి సంబంధించిన వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. బాలయ్య వసుంధరాదేవిని పెళ్లి చేసుకున్నప్పటి వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో షికారు చేస్తుండగా, ఇది చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. వసుంధర బాలయ్య బంధువుల అమ్మాయే అని తెలుస్తుండగా, ఎన్టీఆర్ రాజకీయాలలో బిజీగా ఉన్న సమయంలో బాలకృష్ణ వివాహం చేసుకున్నాడు.
చాలా మందికి బాలయ్య పెళ్లికి సంబంధించి క్లారిటీ లేదు. ఈ వెడ్డింగ్ కార్డ్ చూస్తే మాత్రం పెళ్లి ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది వంటి విషయాలపై మాత్రం పూర్తి క్లారిటీ వస్తుంది. బాలయ్య వెడ్డింగ్ కార్డ్ లో తిరుపతిలో పెళ్ళి జరిగినట్టు ఉండగా, బుదవారం మధ్యాహ్నంముహూర్తంలో పెళ్లి ఫిక్స్ చేశారు. ఈ కార్డ్ నందమూరి వారిది కాదు. వసుందరా దేవి పుట్టింటి వారి పెళ్లి కార్డ్ కావడం విశేషం. 1982 డిసెంబర్ 8న వసుందర దేవి బాలయ్య వివాహం జరిగింది. ఈ దంపతులకి ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి సంతానం. బాలయ్య తన తనయుడు మోక్షజ్ఞని త్వరలోనే వెండితెరకి పరిచయం చేయబోతున్నట్టుగా ఒక టాక్ నడుస్తుంది.