Tamim Iqbal: గుండెపోటుతో.. మైదానంలోనే కుప్పకూలిన బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్
బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్(36) క్రికెట్ ఆడుతునే మైదానంలోనే గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలారు. ఢాకా ప్రీమియర్ లీగ్లో మ్యాచ్ ఆడుతూ గుండెపోటుకు గురయ్యాడు.

Tamim Iqbal Heart Attack: గుండెపోటు ఎప్పుడు ఎవరికి కబళిస్తుందో తెలియని పరిస్థితి. ఆకస్మాత్తుగా వచ్చే గుండెపోటుల బారిన పడి ప్రపంచ వ్యాప్తంగా నిత్యం ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. సకాలంలో సీపీఆర్ తో కొందరు..ఆసుపత్రిలో చేర్పించడం ద్వారా మరికొందరు ప్రాణాలలో బయటపడుతున్నారు. తాజాగా బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్(36) క్రికెట్ ఆడుతునే మైదానంలోనే గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలారు. ఢాకా ప్రీమియర్ లీగ్లో మ్యాచ్ ఆడుతూ గుండెపోటుకు గురయ్యాడు.
సహచరులు, వైద్య సిబ్బంది వెంటనే సీపీఆర్ చేసినప్పటికి పరిస్థితి విషమించడంతో వెంటనే స్థానికి ఫజిలాతున్నెసా ఆసుపత్రికి తరలించారు. హెలికాప్టర్ లో ఢాకా తరలించేందుకు హెలిప్యాడ్ కు తీసుకెలుతుండగా.. మళ్లీ గుండెపోటు రావడంతో తిరిగి అదే ఆసుపత్రికి తీసుకెళ్లారు. తమీమ్ ఇక్బాల్ కు ప్రస్తుతం వైద్యులు వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నారు. తమీమ్ కు యాంజియో గ్రామ్, యాంజియో ప్లాస్టీ చేశామని..ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా ఉందని అబ్జర్వేషన్ లో ఉంచామని వైద్యులు తెలిపారు. తమీమ్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తమీమ్ ఆరోగ్య పరిస్థితిపై ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ ఆరా తీశారు. ఈ ఏడాడి జనవరిలోనే తమీమ్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. బంగ్లా తరుపున తమీమ్ 70టెస్టులు, 78టీ 20లు ఆడాడు. 243వన్డేలు ఆడి 8,357 పరుగులు చేశాడు.