నిజంగా ఇది ఊహించ‌ని పోటీ.. వ‌చ్చే ఏడాది సంక్రాంతి మొత్తం సీనియర్ హీరోలదే..!

  • By: sn    breaking    Feb 29, 2024 12:05 PM IST
నిజంగా ఇది ఊహించ‌ని పోటీ.. వ‌చ్చే ఏడాది సంక్రాంతి మొత్తం సీనియర్ హీరోలదే..!

ప్ర‌తి సంక్రాంతికి టాలీవుడ్‌లో సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొని ఉంటుంది. పెద్ద హీరోల సినిమాలు క‌నీసం మూడు నాలుగు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సంద‌డి చేస్తూ ఉంటాయి. ఆ సినిమాల‌లో అన్ని కూడా మంచి విజ‌యాల‌నే అందుకొని ప్రేక్ష‌కుల‌కి వినోదం పంచుతుంటాయి. ఈ ఏడాది సంక్రాంతికి గుంటూరు కారం, హ‌నుమాన్, సైంధ‌వ్, నా సామిరంగ చిత్రాలు వ‌చ్చాయి. వీటిలో హ‌నుమాన్ చిత్రం ఎవ‌రు ఊహించని విధంగా అతి పెద్ద విజ‌యం సాధించింది. ఇక భారీ హోప్స్ పెట్టుకున్న గుంటూరు కారం చిత్రం అంచ‌నాలు అందుకోలేక చతికిల ప‌డింది. వెంక‌టేష్ న‌టించిన సైంధ‌వ్ చిత్రం దారుణంగా విఫ‌ల‌మైంది.ఇక నాగార్జున న‌టించిన నా సామిరంగ చిత్రం ప‌ర్వాలేద‌నిపించింది. ఇక వ‌చ్చే ఏడాది సంక్రాంతికి ఏయే సినిమాలు రాబోతున్నాయి అనే దానిపై ఇప్పుడు చ‌ర్చ న‌డుస్తుంది.

సంక్రాంతికి వ‌చ్చిన సినిమాల‌కి మోస్త‌రు టాక్ వ‌చ్చిన కూడా భారీ క‌లెక్షన్స్ వ‌స్తాయి కాబ‌ట్టి చాలా మంది హీరోలు త‌మ సినిమాల‌ని సంక్రాంతికి రిలీజ్ చేయాల‌ని భావిస్తున్నారు. కాంపిటీష‌న్ ఎక్క‌డ ఎక్కువ ఉంటుందో అని చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలోనే చాలా మంది హీరోలు త‌మ సినిమా రిలీజ్ డేట్ ప్ర‌క‌టిస్తున్నారు. ఈ క్ర‌మంలో 2025 లో సంక్రాంతికి వచ్చే సినిమాలు ఇవే అంటూ ప‌లు ప్ర‌క‌ట‌న‌లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే చిరంజీవి ‘విశ్వంభర’ సినిమా 2025 సంక్రాంతికి వస్తుందని ప్రకటించారు. అలాగే ‘శతమానం భవతి’ సీక్వెల్ అయిన ‘శతమానం భవతి నెక్స్ట్ పేజీ’ కూడా సంక్రాంతికి వ‌స్తుంద‌ని అన్నారు.

కాని దిల్ రాజు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందనున్న ‘వెంకటేష్ 76’ ని 2025 సంక్రాంతికి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు స‌మాచారం అందుతుంది. ఇక బాబీ ద‌ర్శ‌క‌త్వంలో బాల‌య్య చేస్తున్న చిత్రం ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ మూవీని సంక్రాంతికి తెచ్చే విధంగా మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్న‌ట్టు టాక్. ఇక నాగార్జున న‌టిస్తున్న తాజా చిత్రాన్ని సైతం 2025 సంక్రాంతికే తీసుకు రాబోతున్నట్టు సమాచారం. అలా జరిగితే కనుక.. 2025 సంక్రాంతి మొత్తం సీనియర్ హీరోలదే అవుతుంది. మ‌రి ఈ సీనియర్ హీరోల ర‌చ్చకి బాక్సాఫీస్ షేక్ కావ‌డం ఖాయం అని కూడా కొంద‌రు చెప్పుకొస్తున్నారు. రానున్న రోజులలో వీటిపై పూర్తి క్లారిటీ రానుంది.