WhatsApp | సరికొత్తగా సేఫ్టీ ఫీచర్‌ను పరిచయం చేయనున్న వాట్సాప్‌..! ఇక స్క్రీన్‌ షాట్‌ తీయలేరు..!

WhatsApp | సరికొత్తగా సేఫ్టీ ఫీచర్‌ను పరిచయం చేయనున్న వాట్సాప్‌..! ఇక స్క్రీన్‌ షాట్‌ తీయలేరు..!

WhatsApp | ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగిస్తున్న యాప్‌లలో వాట్సాప్‌ ఒకటి. ఈ క్రమంలో కంపెనీ యూజర్ల భద్రతతో పాటు గోప్యతకు ప్రాధానం ఇస్తూ వస్తున్నది. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు అనేక ఫీచర్స్‌ను పరిచయం చేస్తున్నది. తాజాగా మరో సరికొత్త ఫీచర్‌ను తెచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ ఫీచర్‌తో యూజర్లందరికీ ఎంతో ఉపయుక్తంగా మారనున్నది. ప్రస్తుతం వాట్సాప్‌ వినియోగిస్తున్న ప్రతి ఒక్కరూ దాదాపుగా డీపీ, ప్రొఫైల్‌ పిక్‌ను పెట్టుకుంటారు. చాలామంది తమ ఫొటోలను డీపీగా పెట్టుకుంటూ వస్తుంటారు.

అయితే, డీపీని చాలా మంది చూసేందుకు ఛాన్స్‌ ఉంటుంది. దాంతో పాటు ఇతరులు స్క్రీన్‌ షాట్‌ తీసే సౌలభ్యం ఉన్నది. ఇక దీనికి చెక్‌ పెట్టేందుకు వాట్సాప్‌ ఫీచర్‌ను తీసుకువస్తున్నది. దాంతో ఇతరులు ప్రొఫైల్‌ పిక్‌ను స్క్రీన్‌ షాట్‌ తీసే వీలుండదు. ప్రస్తుతం కంపెనీ బీటా టెస్టర్ల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది. వీలైనం త్వరగా టెస్టింగ్‌ పూర్తి చేసి యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నది. ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చాక.. ఎవరైనా డీపీని స్క్రీన్‌ షాట్‌ తీసేందుకు చేస్తే ‘Can’t Take A Screenshot Due To App Restrictions’ అనే మెస్సేజ్‌ డిస్‌ప్లే కనిపిస్తుంది. వాస్తవానికి గతంలో డీపీని డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం ఉండేది.

ఆ ఫీచర్‌ను 2019లో వాట్సాప్‌ తొలగించింది. యువతులతో పాటు మహిళలు ఎవరైనా ఫొటోలను డీపీలుగా పెట్టుకుంటే గిట్టని వ్యక్తులు, సైబర్‌ నేరగాళ్లు స్క్రీన్‌షాట్స్‌ తీసుకొని వేధింపులకు గురి చేసే అవకాశాలు లేకపోలేదు. ఇటీవల కాలంలో మార్ఫింగ్‌, డీప్‌ఫేక్‌ టెక్నాలజీని వాడి మానసికంగా ఇబ్బందులకు గురి చేయడంతో పాటు డబ్బులు లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. మరికొందరు వ్యక్తులు ఫొటోలను అసభ్యకరమైన రీతిలో చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్న ఉదంతాలు చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో వాట్సాప్‌ ఈ పీచర్‌ తీసుకురాబోతున్నదని, ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని టెక్‌ నిపుణులు పేర్కొంటున్నారు.