నిరుద్యోగితో ప్రేమ పెళ్లి.. యువ‌తి త‌ల్లిదండ్రులు ఏం చేశారంటే..?

ఈ స‌మాజంలో నిరుద్యోగులు అంటేనే ఓ చిన్న‌చూపు. వారు బ‌త‌క‌లేర‌ని, అస‌లు వారు ప‌నికిరారు అన్న‌ట్లుగా ట్రీట్ చేస్తున్నారు. చివ‌ర‌కు నిరుద్యోగుల‌కు పిల్ల‌ను ఇచ్చేందుకు సాహ‌సం చేయ‌డం లేదు. ఇలాంటి ప‌రిస్థితుల‌ను నిత్యం చూస్తూనే ఉన్నాం.

నిరుద్యోగితో ప్రేమ పెళ్లి.. యువ‌తి త‌ల్లిదండ్రులు ఏం చేశారంటే..?

పాట్నా : ఈ స‌మాజంలో నిరుద్యోగులు అంటేనే ఓ చిన్న‌చూపు. వారు బ‌త‌క‌లేర‌ని, అస‌లు వారు ప‌నికిరారు అన్న‌ట్లుగా ట్రీట్ చేస్తున్నారు. చివ‌ర‌కు నిరుద్యోగుల‌కు పిల్ల‌ను ఇచ్చేందుకు సాహ‌సం చేయ‌డం లేదు. ఇలాంటి ప‌రిస్థితుల‌ను నిత్యం చూస్తూనే ఉన్నాం. అయితే ఓ యువ‌తి నిరుద్యోగిని ప్రేమించి, పెళ్లి చేసుకుంది. దీంతో ఆమె కుటుంబ స‌భ్యులు వారి ప్రేమ పెళ్లిని తీవ్రంగా వ్య‌తిరేకించారు. వారిని విడ‌దీసేందుకు య‌త్నించారు. ఈ ఘ‌ట‌న బీహార్‌లోని టెటారియా గ్రామంలో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. టెటారియా గ్రామానికి చెందిన వర్ష కుమారి, ధునియామన్రాన్ గ్రామానికి చెందిన ఉమేష్ యాదవ్ ప్రేమించుకున్నారు. ఉమేష్ నిరుద్యోగి. వీరి ప్రేమ విష‌యం వ‌ర్ష త‌ల్లిదండ్రుల‌కు తెలుసు. దీంతో వర్షకు ప్రభుత్వ ఉద్యోగితో పెళ్ళి సంబంధం కుదిర్చారు. త‌ల్లిదండ్రులు కుద‌ర్చిన పెళ్లి వ‌ర్ష‌కు ఇష్టం లేదు. దీంతో ఆ పెళ్లికి ఏడు రోజుల ముందు ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆ త‌ర్వాత ఓ గుడిలో ఉమేష్‌ను పెళ్లి చేసుకుంది. విష‌యం తెలుసుకున్న ఆమె త‌ల్లిదండ్రులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

దీంతో పోలీసులు ఉమేష్ ఊరికి వెళ్లారు. వారిద్ద‌రిని స్టేష‌న్‌కు త‌ర‌లించేందుకు పోలీసులు ప్ర‌య‌త్నించారు. అప్పుడు అందరి ముందే వర్ష, ఉమేష్‌ను కౌగిలించుకుని చావనైనా చస్తాను కానీ వదిలేసి రాను అని తేల్చిచెప్పింది. ఇద్దరు మేజర్లు కావడంతో పోలీసులు చేసేదేం లేక వారిని ఇంటికి పంపించారు.