మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో వస్తున్న మమ్ముట్టి.. థ్రిల్లింగ్ అంశాలతో ఫుల్ హోప్స్ పెంచేసిందిగా..!

మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఇటీవలి కాలంలో ఆయన చేసిన సినిమాలన్నీ కూడా మంచి విజయాలు సాధించాయి. చాలా సినిమాలు తెలుగులో కూడా విడుదల అవుతున్నాయి.70 ఏళ్ల వయసులో ప్రయోగాలు చేసుకుంటూ ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్నారు. ఇటీవలే ఆయన “కాథల్: ది కోర్” అనే మూవీలో గే పాత్రలో కనిపించి ప్రేక్షకులని మెస్మరైజ్ చేశాడు. ఇప్పుడు భ్రమయుగం అనే సినిమాతో మరో ప్రయోగానికి సిద్ధం అయ్యారు. ఇది ప్రయోగం అనడం కంటే సాహసం అనే చెప్పాలి. తాజాగా మూవీకి సంబందించిన ట్రైలర్ విడుదల చేయగా, థ్రిల్లింగ్ అంశాలతో సినిమాపై ఆసక్తి పెంచుతుంది.
ట్రైలర్‌లోని హారర్, థ్రిల్లర్ అంశాలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ఇక ఇందులో ఒక డైలాగ్‌ని మార్చి మార్చి చెప్పారు. ఇవి పావులు.. ఇవి రెండూ పాచికలు పడ్డ సంఖ్యను బట్టి పావుని జరపాలి. ముందు ఇక్కడికి చేరిన వాళ్లు గెలిచినట్లు అర్థం. దానికి భాగ్యం ఉండాలి అనే డైలాగ్ పదే పదే వినిపిస్తుంది. ట్రైలర్‌లో కేవలం పాత్రల పేర్లను, ఓ భయంకరమైన కథను మాత్రమే వివరించారు. మిగతా రహస్యాన్ని సినిమాలో చూపించబోతున్నట్టు తెలుస్తుంది. టైమ్ లూప్ స్టోరీ చిత్రంగా ఇది రానుందని అర్ధమవుతుంది. ఒక పాడుబడిన ఇంట్లో బంధించబడి.. అక్కడి నుంచి తప్పించుకునేందుకు దారి దొరక్క అల్లాడుతున్నట్లు ట్రైలర్‌లో చూపించడం ఆసక్తి రేపుతుంది.
భ్రమయుగం : ది ఏజ్ ఆఫ్ మ్యాడ్‌నెస్ అనే టైటిల్ వచ్చిన చిత్రానికి రాహుల్ సదాశివన్ రచన, దర్శకత్వం వహించారు. వైనాట్ స్టూడియోస్, నైట్ షిఫ్ట్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రం ఫిబ్రవరి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంతో మమ్ముట్టి ప్రేక్షకులకి మంచి వినోదం పంచనున్నాడని అర్ధమవుతుంది. ట్రైలర్‌లో చూస్తే కెమెరా వర్క్, బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ భ్రమయుగం ప్రయోగం ఎండ్ రిజల్ట్ మాత్రం థియేటర్ లోకి వచ్చిన తర్వాతే అర్ధమవుతుంది.. ఈ మొత్తం 5 భాషల్లో తెరకెక్కుతుండగా, ఈ మూవీని భారీ బడ్జెట్‌తోనే తెరకెక్కించినట్టు సమాచారం.