Breaking: TSPSC పరీక్షా పేపర్ల కంప్యూటర్ హ్యాక్..? TPBO, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ రాత పరీక్షలు వాయిదా
విధాత: TSPSC పరీక్షా పేపర్ల కంప్యూటర్ హ్యాకింగ్ అయినట్లు టీఎస్‌పీఎస్సీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 12వ తేదీన జరగాల్సిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్‌సీర్ రాతపరీక్ష, 15, 16వ తేదీల్లో నిర్వహించాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ రాతపరీక్షను వాయిదా వేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ శనివారం రాత్రి ప్రకటించింది. వాయిదా పడ్డ పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని స్పష్టం చేసింది. టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్‌సీర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల రాతపరీక్షలకు సంభందించిన ప్రశ్నాపత్రాల […]

విధాత: TSPSC పరీక్షా పేపర్ల కంప్యూటర్ హ్యాకింగ్ అయినట్లు టీఎస్‌పీఎస్సీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 12వ తేదీన జరగాల్సిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్‌సీర్ రాతపరీక్ష, 15, 16వ తేదీల్లో నిర్వహించాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ రాతపరీక్షను వాయిదా వేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ శనివారం రాత్రి ప్రకటించింది.
వాయిదా పడ్డ పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని స్పష్టం చేసింది. టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్‌సీర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల రాతపరీక్షలకు సంభందించిన ప్రశ్నాపత్రాల కంప్యూటర్ హ్యాక్ అయిందని టీఎస్‌పీఎస్సీ అనుమానం వ్యక్తం చేసింది. దీంతో టీఎస్‌పీఎస్సీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.