సీఎం కేసీఆర్ సభలో బుల్లెట్ల కలకలం

ముఖ్యమంత్రి సభలో అస్లాం అనే వ్యక్తి వద్ద బుల్లెట్లు దొరకడం కలకలం రేపింది.

సీఎం కేసీఆర్ సభలో బుల్లెట్ల కలకలం

2 బుల్లెట్ల స్వాధీనం…వ్యక్తిని

అదుపులోకి తీసుకున్న పోలీసులు….!

విధాత: మెదక్ ప్రత్యేక ప్రతినిధి:

మెదక్ జిల్లా నర్సాపూర్ లో సీఎం కెసిఆర్ ప్రజా ఆశీర్వాద సభలో బుల్లెట్ల కలకలం రేపింది.ప్రెస్ గ్యాలరీలో కి గుర్తు తెలియని వ్యక్తి విలేఖరీ నీ అంటూ సభా ప్రాంగణం లోకి వస్తూoడాగా పోలీసులు ఆ వ్యక్తిని ఆపి ఐడి కార్డు అడుగగా సదరు వ్యక్తి తన జేబులో నీ పర్సు తీయగా అందులో 2 బుల్లెట్ల ఉన్నట్లు తెలుస్తుంది.వెంటనే అతన్ని పోలీస్ లు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.


మెదక్ జిల్లా నర్సా పూర్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచార సభలో ఈ ఘటన చోటుచేసుకుంది. సభకు హాజరైన అస్లాం అనే వ్యక్తి నుంచి పోలీసులు రెండు బుల్లెట్లు స్వాధీనం చేసుకొని అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అస్లాంకు బుల్లెట్లు ఎక్కడి నుండి వచ్చాయి.. అతను వాటితో సభకు ఎందుకు హాజరయ్యాడని అంశంపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.