మూడ్ వ‌స్తే మ్యాచ్‌కి ముందు కూడా అది చేస్తాడంటూ వార్న‌ర్ భార్య షాకింగ్ కామెంట్స్

  • By: sn    breaking    Jan 01, 2024 10:04 AM IST
మూడ్ వ‌స్తే మ్యాచ్‌కి ముందు కూడా అది చేస్తాడంటూ వార్న‌ర్ భార్య షాకింగ్ కామెంట్స్

సీనియ‌ర్ ప్లేయ‌ర్స్ ఒక్కొక్క‌రుగా క్రికెట్ వీడ్కోలు పలుకుతున్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం డేవిడ్ వార్నర్ సొంత మైదానం ‘సిడ్నీ క్రికెట్ గ్రౌండ్’ వేదికగా కెరీర్‌లో చివరి టెస్ట్ మ్యాచ్ ఆడనున్నాడు. జనవరి 3న మొదలుకానున్న ఈ మ్యాచ్ అతడి టెస్టు కెరీర్‌లో చివరి మ్యాచ్ కానుంది. డేవిడ్ వార్నర్‌కి ఇదే చివరి టెస్ట్ మ్యాచ్ అని చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ తెలిపాడు. డేవిడ్ వార్నర్ తన సొంత మైదానంలో చివరి టెస్ట్ మ్యాచ్ ఆడనున్నాడు అని అన్నాడు. చివరి టెస్ట్ మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ శాశ్వతంగా గుర్తుండి పోయే ఇన్నింగ్స్ ఆడాలని ఆకాంక్షిస్తున్నట్టు ఆస్ట్రేలియా సెలక్టర్ జార్జ్ బెయిలీ స్ప‌ష్టం చేశారు.

డేవిడ్ వార్నర్ చివరి టెస్ట్ మ్యాచ్‌ను అతడి హోమ్ గ్రౌండ్‌లో సెలబ్రేట్ చేసుకోవడానికి తామంతా ఎదురుచూస్తున్నామని బెయిలీ పేర్కోన్నారు. మ‌రోవైపు వార్నర్‌కు ఘనంగా వీడ్కోలు పలికేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా ఏర్పాట్లు చేస్తోంది. ఇక ఇదిలా ఉంటే వార్న‌ర్ వీడ్కోలు ప‌లుకుతున్న నేప‌థ్యంలో ఆయ‌న‌కి సంబంధించిన అనేక వీడియోలు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. గతంలో ఓ రేడియో షోలో వార్న‌ర్ సతీమ‌ణి క్యాండిస్ వార్నర్ తన లైంగిక జీవితంపై చేసిన బోల్డ్ కామెంట్స్ వైరల్‌గా మారాయి. మూడేళ్ల క్రితం 2020లో ‘ది కైల్ అండ్ జాకీ ఓ’ షో‌లో పాల్గొన్న క్యాండిస్‌ని హోస్ట్ కిస్ కైల్.. ‘ఫుట్ బాల్ ప్లేయర్లు మ్యాచ్‌కు ముందు సెక్స్ చేయరు. క్రికెటర్లు కూడా ఈ నిబంధనను పాటిస్తారా? డేవిడ్ వార్నర్ తన మ్యాచ్‌కు ముందు సెక్స్ చేస్తాడా?’అని ఆమెని ప్ర‌శ్నించాడు.

దానికి స‌మాధానంగా క్యాండిస్ అత‌నికి మూడ్ వ‌స్తే చేస్తాడ‌ని పేర్కొంది. చేయకుండా ఉండవద్దనే రూల్ అయితే ఏమి లేదు క‌దా అని స్ప‌ష్టం చేసింది. ఈ విషయంలో తన భర్త చాలా సమర్థుడని కూడా క్యాండిస్ సంచ‌ల‌న కామెంట్స్ చేసింది. మ్యాచ్‌కు ముందు సెక్స్ చేయడానికి వార్నర్ సిద్దమైతే ఏం చేస్తారని హోస్ట్ ప్రశ్నించగా.. అతనికి సహకరిస్తానంటూ క్యాండిస్ బోల్డ్ కామెంట్స్ చేయ‌డం విశేషం. అయితే క్యాండిస్ సమాధానం విన్న హోస్ట్ కైల్.. ఒక్కసారి షాక్ అయి ఆమెని ప్ర‌శంసించాడు.. ‘ఎంత మంచి మహిళవో.. అందుకే మీ బంధం గట్టిగా ఉంది’అని కొనియాడాడు. ఇక డేవిడ్ వార్నర్, క్యాండిస్ దంపతులకు ముగ్గురు పిల్లలు. ఇవి(9ఏళ్లు), ఇండి(7 ఏళ్లు), ఇస్లా(5 ఏళ్లు) ముగ్గురు అమ్మాయిలే. వారు సోష‌ల్ మీడియాలో చాలా ఫేమ‌స్.