బంపర్ ఆఫర్.. రామ్ చరణ్ సినిమాలో నటించాలని అనుకుంటే ఈ పని చేయండి..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఉప్పెన’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన దర్శకత్వంలో తన 16వ సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. మరి కొద్ది రోజులలో ఈ మూవీ షూటింగ్ జరగనుండగా, ఈ సినిమాలో నటించడానికి కొందరు నటీనటులు కావాలని మేకర్స్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆడిషన్ కాల్ అంటూ వదిలిన పోస్టర్‌లో అన్ని వయసులకు సంబంధించిన ఆడ, మగ ఈ ఆడిషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపారు.
ఆసక్తి ఉన్న వారు చేయవల్సింది ఏంటంటే.. ఒక నిమిషం నిడివి ఉన్న యాక్టింగ్ వీడియోతో పాటు మూడు ఫొటోలు, కాంటాక్ట్ వివరాలను rc16bb.casting@gmail.comకి ఈమెయిల్ కానీ.. 8143682909 నంబర్‌కు వాట్సాప్ మెసేజ్ కానీ చేయొచ్చు అని అన్నారు. అయితే, ఇక్కడొక షరతు కూడా ఉంది. కచ్చితంగా ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడేవాళ్లకు మాత్రమే ఈ ఆడిషన్ అని చెప్పుకొచ్చారు. మరి అలా మాట్లాడేవారు మంచి టాలెంట్ ఉన్నవారు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆడిషన్‌కి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాని స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమాను బుచ్చిబాబు తెరకెక్కించనున్నారు. అయితే, ఇది కేవలం స్పోర్ట్స్ డ్రామా మాత్రమే కాదని.. రా, రస్టిక్ మూవీ అని గతంలో బుచ్చిబాబు చెప్పిన విషయం తెలిసిందే.
ఇక ఈ చిత్రానికి మ్యూజిక్ మ్యాస్ట్రో ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఇటీవల రెహమాన్ ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ.. ఇలాంటి కథను ఈ మధ్య కాలంలో తాను వినలేదని బుచ్చిబాబును ఎ.ఆర్.రెహమాన్ ప్రశంసించినట్టు వార్తలు వచ్చాయి. మరి తొలి సినిమాతో సంచలనం రేపిన బుచ్చిబాబు రెండో సినిమాతో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తాడో చూడాలి.