హైద‌రాబాద్ స్కూల్లో చెడ్డీ గ్యాంగ్ హ‌ల్‌చ‌ల్‌.. రూ. 7.85 ల‌క్ష‌లు చోరీ.. వీడియో

హైద‌రాబాద్ నగ‌రంలో చెడ్డీ గ్యాంగ్ క‌ల‌క‌లం రేపింది. న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో హ‌ల్‌చ‌ల్ సృష్టిస్తున్నారు దొంగ‌లు. తాజాగా శ‌నివారం అర్ధ‌రాత్రి ఓ స్కూల్‌లోకి ప్ర‌వేశించిన చెడ్డీ గ్యాంగ్.. రూ.7.85 ల‌క్ష‌ల న‌గ‌దును అప‌హ‌రించారు.

హైద‌రాబాద్ స్కూల్లో చెడ్డీ గ్యాంగ్ హ‌ల్‌చ‌ల్‌.. రూ. 7.85 ల‌క్ష‌లు చోరీ.. వీడియో

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ నగ‌రంలో చెడ్డీ గ్యాంగ్ క‌ల‌క‌లం రేపింది. న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో హ‌ల్‌చ‌ల్ సృష్టిస్తున్నారు దొంగ‌లు. తాజాగా శ‌నివారం అర్ధ‌రాత్రి ఓ స్కూల్‌లోకి ప్ర‌వేశించిన చెడ్డీ గ్యాంగ్.. రూ.7.85 ల‌క్ష‌ల న‌గ‌దును అప‌హ‌రించారు.

మియాపూర్ ప‌రిధిలోని హ‌ఫీజ్‌పేట్ స‌మీపంలోని విజ్ఞాన్ వ‌ర‌ల్డ్ వ‌న్ స్కూల్‌లోకి శ‌నివారం రాత్రి చెడ్డీ గ్యాంగ్‌కు సంబంధించిన ఇద్ద‌రు దొంగ‌లు ప్ర‌వేశించారు. ముఖానికి మాస్కులు ధ‌రించారు. స్కూల్‌లో ఉన్న రూ. 7.85 ల‌క్ష‌ల‌ను దొంగ‌లు అప‌హ‌రించారు. ఈ దృశ్యాలు అక్క‌డున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

ఆదివారం ఉద‌యం స్కూల్ వ‌ద్ద‌కు చేరుకున్న సిబ్బంది.. చోరీ జ‌రిగిన‌ట్లు గుర్తించారు. దీంతో మియాపూర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఇన్నాళ్లు ఇండ్ల‌లో చోరీల‌కు పాల్ప‌డ్డ చెడ్డీ గ్యాంగ్.. ఇప్పుడు స్కూళ్ల‌ను కూడా వ‌దిలిపెట్ట‌డం లేదు.