Telangana | స్కూళ్లకు రేపట్నుంచి దసరా సెలవులు.. 26న పునఃప్రారంభం

Telangana | రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు ఈ నెల 13వ తేదీ నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. 13 రోజుల సెలవుల అనంతరం అక్టోబర్ 26న బడులు పునఃప్రారంభం కానున్నాయి. దసరా పండుగను 23వ తేదీన నిర్వహించుకోనున్నారు.
ALSO READ : Chahal-Dhanashree Divorced: విడాకులు తీసుకున్న.. క్రికెటర్ చాహల్, ధనశ్రీ వర్మ! భరణం ఎన్ని కోట్లంటే?
ఇక ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు సమ్మెటివ్ అసెస్మెంట్(ఎస్ఏ-1) పరీక్షలు బుధవారంతో ముగిశాయి. ఎస్ఏ-1 పరీక్షల ఫలితాలను సెలవుల అనంతరం వెల్లడించనున్నారు. మరోవైపు ఫార్మెటివ్ అసెస్మెంట్-1, 2 పరీక్షల మార్కులను గురువారం లోపు చైల్డ్ ఇన్ఫోలో నమోదు చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. అన్ని జూనియర్ కాలేజీలకు ఈ నెల 19వ తేదీ నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి.