రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఇలా అయిపోయాడేంటి.. ఏదైన అనారోగ్యమా?

రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఎన్నో మంచి సినిమాలకి అద్భుతమైన మ్యూజిక్ అందించి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా అవతరించాడు దేవి. పుష్ప ది రైజ్ చిత్రానికి నేషనల్ అవార్డ్ ను కూడా సొంతం చేసుకున్న దేవి శ్రీ ప్రసాద్ ఎంతో క్రేజ్‌ని అదుకున్నాడు. ఆయన ప్రస్తుతం నాగ చైతన్య తండేల్ మూవీకి సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు. ఈ చిత్రంతో దేవి శ్రీ ప్రసాద్ 25 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్నాడు. 1999లో డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన దేవి సినిమాతో తన మ్యూజికల్ జర్నీ స్టార్ట్ చేసిన దేవిశ్రీ ఎంతో మంది స్టార్ హీరోలక సినిమాలకి సూపర్ డూపర్ మ్యూజిక్ అందించాడు.
ఆనందం, కలుసుకోవాలని, ఖడ్గం, మన్మథుడు, సొంతం, వెంకీ, ఆర్య, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బన్నీ, భద్ర, ఒక ఊరిలో దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతం అందించిన చిత్రాలు ఎవర్ గ్రీన్ హిట్స్‌గా నిలిచాయి.. టాలీవుడ్ ,బాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని భాషల శ్రోతలని తన సంగీతంలో అలరిస్తున్నాడు దేవి. అయితే ఇటీవల ఈ రాక్ స్టార్ నుండి మంచి హిట్స్ రాకపోవడం అభిమానులని కాస్త నిరాశ పరుస్తుంది. పుష్ప సినిమాతో కమ్ బ్యాక్ ఇచ్చిన దేవి ఇప్పుడు పుష్ప 2 సినిమా కోసం పని చేస్తున్నాడు. అయితే దేవి శ్రీ ప్రసాద్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 25 ఏళ్లు పూర్తైన సందర్బంగా తండేల్ టీం మేకర్స్ ఆయనకి విషెస్ తెలుపుతూ ఓ సరికొత్త వీడియో విడుదల చేశారు.
ఇక ఇదిలా ఉంటే దేవి శ్రీ ప్రసాద్ వద్దకు తన గురువు ఇళయ రాజా రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. దేవి శ్రీ మ్యూజిక్ స్టూడియోను ఇళయరాజా సందర్శించారు. దీంతో తన ఇన్నాళ్ల కల నెరవేరిందని పొంగిపోతూ ఆయనతో దిగిన పలు ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేశాడు దేవి. ఇప్పుడు ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే పిక్స్‌లో దేవి శ్రీ ప్రసాద్ న్యూ లుక్ చూసి అభిమానులు ఖంగుతింటున్నారు. ఎలా ఉండే దేవి ఎలా అయిపోయాడంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు .ఏదైన అనారోగ్యమా లేకుండా డైటింగ్ మెయింటైన్ చేస్తూ ఇలా సన్నగా మారిపోయాడా అంటూ కొందరు ఆలోచనలు చేస్తున్నారు. ప్రస్తుతం దేవి శ్రీ ఐదు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న కుబేరతో పాటు తండేల్ , పవన్ కళ్యాణ్ హీరోగా, హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ , పుష్ప2 చిత్రాలకి సంగీతం అందిస్తున్నాడు.