ఏంటి.. నాగ చైతన్య కన్నా ముందే సమంత అతని ప్రేమలో ఉందా.. చాలా లేట్‌గా బయటపడ్డ సీక్రెట్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న అందాల ముద్దుగుమ్మ సమంత. ఏ మాయ చేశావే సినిమాతో సమంత కెరీర్ మొదలు కాగా, ఇటీవల ఆమె సినీ జర్నీ 14 ఏళ్లు పూర్తైంది. ఈ క్రమంలో సమంతకి పలువురు, ప్రముఖుల నుండి కూడా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్న సమంతకి ఇప్పుడు గడ్డు కాలం నడుస్తుంది. చైతూ నుండి విడిపోవడం, ఆ తర్వాత మయోసైటిస్ వ్యాధి బారిన పడడం సమంతని బాగా కుంగదీసాయి. ఇప్పుడు క్రమంగా కోలుకుంటున్న సమంత త్వరలో మరింత ఉత్సాహంతో సినిమాలు చేసి ప్రేక్షకులని అలరించనుంది.
అయితే నాగ చైతన్య నుండి విడిపోయినప్పటి నుండి సమంతకి సంబంధించిన ఏదో ఒక వార్త నెట్టింట వైరల్ అవుతూనే ఉంటుంది. తాజాగా సమంత ప్రేమాయణానికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. సమంత- నాగ చైతన్య కొన్నేళ్లపాటు ప్రేమించుకొని ఆ తర్వాత 2017లో వివాహం చేసుకున్నారని అందరికి తెలుసు. కాని నాగ చైతన్య కన్నా ముందు సమంత ఒక అబ్బాయి ప్రేమలో పడిందట.ఈ విషయం ఇప్పటివరకు ఎవరికి తెలియదు. రీసెంట్‌గా సమంతనే ఈ లవ్ స్టోరీ బయటపెట్టింది. తాను చదువుకునే రోజులలో సమంత పల్లవరం నుండి టీనగర్ వెళ్ళడానికి ప్రతి రోజు రెండు బస్సులు మారాల్సి వచ్చేదట. అయితే ఒక అబ్బాయి నిత్యం సమంత కోసం బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేస్తూ సమంతని గమనించేవాడట.
సమంతను స్కూల్ వరకు కూడా ఫాలో అయ్యేవాడట కాని ఎప్పుడు ఆమె దగ్గరకు వెళ్లి మాట్లాడే ప్రయత్నం చేయలేదట. సమంతని అలా అనుసరిస్తూ ఉండేవాడట. ఈ క్రమంలో తన ఇంటర్ కూడా పూర్తైంది. అయితే ఓ రోజు సమంత ఆ అబ్బాయి దగ్గరకు వెళ్లి ఎందుకు రెండేళ్లుగా నా వెనకాల పడుతున్నావ్ అని డైరెక్ట్‌గా అతనిని అడగడంతో ఆ అబ్బాయి ఫాలో కావడం లేదని సమాధానం ఇచ్చాడట. దాంతో సమంత ఒకింత షాక్ అయిందట. అయితే అది ప్రేమో కాదో తెలియదు కానీ… అదే నా ఫస్ట్ లవ్ అంటూ సమంత చెప్పడం విశేషం. అయితే సమంత మాటలను బట్టి గమనిస్తే సమంత కూడా అతనిని ఇష్టపడింది కాని ఆ అబ్బాయి ధైర్యం చేసి చెప్పకపోవడంతో సమంత కూడా సైలెంట్‌గా ఉందని అర్ధమవుతుంది.